Site icon Prime9

Google I/O 2023: కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన గూగుల్.. పిక్సెల్‌ ఫోల్డ్‌ ధర ఎంతంటే?

Google 2023

Google 2023

Google I/O 2023: ప్రముఖ టెక్‌ కంపెనీ గూగుల్‌ ప్రతి ఏడాది నిర్వహించే వార్షిక సమావేశం ‘గూగుల్‌ I/O 2023’జరిగింది. ఈ కార్యక్రమంలో సంస్థ పలు కొత్త ఉత్పత్తులను, సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్స్ ను ఆవిష్కరించింది. గూగుల్ నుంచి తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘Pixel Fold’సహా ‘Pixel 7a’ స్మార్ట్‌ ఫోన్‌, Pixel Tablet ను విడుదల చేసింది. సాఫ్ట్‌వేర్‌ పరంగా చూస్తే ‘Find My divise’, వాట్సాప్‌కు WearOS, Unwanted tracker alert లాంటి కొత్త అప్‌డేట్స్ గురించి వివరించింది. అదే విధంగా రానున్న రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గూగుల్ సేవలకు ఎలా తోడవ్వనుందో తెలియజేసింది.

 

పిక్సెల్‌ ఫోల్డ్‌ విశేషాలు(Google I/O 2023)

గూగుల్‌ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఫోల్డబుల్‌ ఫోన్‌ ‘Pixel Fold’. ఇది టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌తో నడుస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో వస్తోంది. ఈ ఫోన్ లో 12 జీబీ ర్యామ్‌ 512 జీబీ స్టోరేజ్‌ ఇచ్చారు. 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. 4,821 mah బ్యాటరీని అందిస్తోంది. వెనుక వైపు 48 MP, 10.8 MP, 10.8 MPతో కూడిన ట్రిపుల్‌ కెమెరా ఉంది. ముందు భాగంలో సెల్ఫీల కోసం ఔటర్‌ డిస్‌ప్లే పై 9.5 MP కెమెరా ఉంది. ఇన్నర్‌ డిస్‌ప్లేలో 8MP కెమెరాను ఇచ్చారు.

256 GB వేరియంట్‌ ధర అమెరికాలో 1,799 డాలర్లు. ఇది భారత్‌లో దాదాపు ఇది రూ. 1,47,500 వరకు ఉండొచ్చని టెక్‌ నిపుణుల అంచనా. 512 GB వేరియంట్‌ ధర 1,919 డాలర్లు (దాదాపు రూ. 1,57,300 ). పిక్సెల్ ఫోల్డ్ రెండు రంగుల్లో అందుబాటులో ఉంది. పిక్సెల్‌ ఫోల్డ్‌ ను కొన్నవారికి గూగుల్‌ పిక్సెల్‌ వాచ్‌ను ఉచితంగా అందించనుంది. కంపెనీ. అమెరికాలో ప్రీ ఆర్డర్‌ సేల్‌ ప్రారంభించారు.

 

 

Pixel 7a ప్రత్యేకతలు

అదే విధంగా Pixel 7a పోన్ ను ఆవిష్కరించారు. ఈ పిక్సెల్ 7ఏ ఫోన్‌ 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ ఆప్షన్‌తో వచ్చింది. మూడు రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ధర రూ. 43,999 లుగా కంపెనీ నిర్ణయించింది. లాంచ్ ఆఫర్‌లో భాగంగా రూ. 4,000 వరకు తగ్గింపు ఇస్తున్నారు. దీంతో ఈ ఫోన్ రూ. 39,999 కు వస్తోంది. స్క్రీన్ పై కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ఇచ్చారు. టెన్సర్‌ జీ2 ప్రాసెసర్‌ను అమర్చారు. తొలి సారి పిక్సెల్‌ A సిరీస్‌ను 8 జీబీ ర్యామ్‌తో తీసుకొచ్చింది కంపెనీ. 4,385 mah బ్యాటరీ ఉంది. ఈ ణోన్ లో వైర్‌ లెస్‌ ఛార్జింగ్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చారు. వెనక వైపు 64 MP, 12 MP కెమెరా ఉంది. ముందు భాగంలో 10.8 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఆండ్రాయిడ్‌ 13 ఓఎస్‌తో వస్తోంది.

 

 

Pixel Tablet

గూగుల్‌ కంపెనీ తమ తొలి ట్యాబ్లెట్‌ను కూడా పరిచయం చేసింది. Pixel Tablet పేరుతో వస్తున్న ఈ ట్యాబ్‌ కూడా టెన్సర్‌ జీ 2 ప్రాసెసర్‌తో నడుస్తోంది. 11 ఇంచుల స్క్రీన్ అందుబాటులో ఉంది. 8 జీబీ+ 128 జీబీ, 8 జీబీ+ 256 జీబీ లతో రెండు వేరియంట్లలో విడుదల అయింది. వెనుక 8 MP, ముందు 8 MP కెమెరా ఉంది. 4 స్పీకర్లు ఉన్నాయి. దీని ధరను 499 డాలర్లుగా నిర్ణయించారు.

 

Exit mobile version