Prime9

YS Jagan: దళితులపై దాడులు తీవ్రమవుతున్నాయి: వైఎస్ జగన్

Breaking News: YS Jagan : Andhra Pradesh: తిరుపతిలో ఇంజనీరింగ్‌ విద్యార్థిపై దాడి ఘటనపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ స్పందించారు. రాష్ట్రంలో దిగజారిపోయిన శాంతి భద్రతలకు, దళితులపై తీవ్రమవుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అంటూ ఎక్స్‌ వేదికగా విమర్శించారు.

 

రాష్ట్రంలో దళితులు, బలహీన వర్గాల వారికి రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఇంజనీరింగ్‌ విద్యార్థి జేమ్స్‌పై దాడి ఘటనలో పోలీసు యంత్రాంగం వైఫల్యంతో పాటు.. రాజకీయ జోక్యంతో కనీసం ఫిర్యాదును కూడా స్వీకరించలేని పరిస్థితి ఉందన్నారు. తిరుపతి ఘటనకు కారకులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Exit mobile version
Skip to toolbar