Prime9

Vijayawada: దుర్గమ్మ భక్తులకు గమనిక.. 3 రోజులు ఆ దారి బంద్

Temple: విజయవాడ నగరంలో ఏపీలో పెద్ద నగరంగా తయారవుతోంది. పర్యటకంగా, ఆధ్యాత్మికంగా, వ్యాపార, వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతోంది. ఇక విజయవాడ నగరం నడిబొడ్డున కృష్ణా నది తీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ ఆలయం కొలువై ఉంది. భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు సుదూర ప్రాంతాల నుంచి తరలి వస్తుంటారు. అమ్మను దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయానికి భక్తులరాక పెరిగింది.

దీంతో ఆలయ అధికారులు, ప్రభుత్వం భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ విస్తరణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. ఈ నేపథ్యంయలోనే ఇంద్రకీలద్రి కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డును అధికారులు మూడు రోజులు మూసి వేస్తున్నట్టు తెలిపారు. ఘాట్ రోడ్డు మరమ్మతులు చేపడుతున్నందున ఈనెల 6, 7, 8 తేదీల్లో దుర్గగుడి ఘాట్ రోడ్డును మూసివేస్తున్నారు. ఈ నేపథ్యంలో భక్తులు కనకదుర్గానగర్ మార్గంలో వెళ్లాలని సూచించారు. అలాగే ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలకు పున్నమి ఘాట్ వద్ద వాహన పార్కింగ్ ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు ఆలయ అధికారులకు సహకరించాలని కోరారు.

 

Exit mobile version
Skip to toolbar