Prime9

Amaravati: నేడు ఏపీకి ప్రధాని మోదీ.! పర్యటన వివరాలు ఇవే!

Amaravati: ఏపీ రాజధాని అమరావతి పున:ప్రారంభ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం రాష్ట్రానికి రానున్నారు. మధ్యాహ్నం 2.55 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడనుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు సభాస్థలికి చేరుకుంటారు. ప్రధాని అమరావతిలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతో పాటు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధాని పర్యటన సమారుగా గంటా పదిహేను నిమషాల పాటు ఉంటుంది.కార్యక్రమం అనంతరం ప్రధాని మోదీ ఢిల్లీకి వెళ్లనున్నారు. ప్రధాని మోదీ పర్యటనకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

 

ప్రధాని మోదీ పర్యటన పై మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసేలా ఎప్పటికప్పుడు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అవసరమైన రవాణా,ఆహారం,డ్రింకింగ్ వాటర్,భద్రతా ఏర్పాట్ల పై వరుస సమీక్షలు, టెలికాన్ఫరెన్స్ లు మంత్రి నిర్వహించారు. ప్రజారాజధాని అమరావతి పునఃప్రారంభం కార్యక్రమం విజయవంతం చేయలని మంత్రి తెలిపారు. గత ఐదు రోజులుగా ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకూ ప్రధాని పర్యటన ఏర్పాట్లపైనే మంత్రి దృష్టి పెట్టారు.

 

ప్రధాని నరేంద్ర మోదీ సభకు 5 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని నోడల్ ఆఫీసర్ వీర పాండ్యాన్ అన్నారు.  అన్ని జిల్లాల నుంచి సభకు ప్రజలు వస్తున్నారు. 8 వేల బస్సులు సభా ప్రాంగణానికి వస్తున్నాయి. 5 వేల కార్లు, ఆటోలు, టూ వీలర్లు 2వేలకు వస్తున్న వాహణాలకు. 11 పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేశారు.

 

ప్రత్యేక పైలాన్
 అమరావతి పున:నిర్మాణ పనులను ప్రతిబింబించేలా ప్రత్యేక పైలాన్ నిర్మించారు. మధ్యాహ్నం 3.25 నుంచి 4.45 గంటల వరకు మోదీ అమరావతి పర్యటన జరగనుంది. సభ వేదికపై 14 మందికి అనుమతిచ్చారు. మొదట మంత్రి నారాయణ స్వాగతోపన్యాసం చేయనున్నారు. తర్వాత సీఎం చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. 12 నిమిషాల పాటు ప్రధాని మోడీ ప్రసంగం ఉండే ఛాన్స్ ఉంది. స్పీచ్ తర్వాత రిమో‌ట్‌తో అమరావతి పైలాన్ ఆవిష్కరించనున్నారు. అమరావతిని సూచించేలా A ఆకారంలో పైలాన్ ఉండనుంది. పైలాన్‌పై గ్రానెట్ రాళ్లతో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు పేర్లు ఉండనున్నాయి.

 

Exit mobile version
Skip to toolbar