Prime9

Pawan Kalyan: విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం మృతి.. పవన్ కల్యాణ్ సంతాపం

Ahmedabad Plane Crash: అహ్మదాబాద్ లో నిన్న జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి చెందిన విషయం తెలిసిందే. ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. విజయ్ రూపానీ మృతిపట్ల సంతాపం ప్రకటించారు. అలాగే విమాన ప్రమాదంలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

 

కాగా అహ్మదాబాద్ లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీతో పాటు 297 మంది మరణించారు. “ఈ ఘటన అందరిలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ప్రజా సేవకు నిజమైన నిబద్ధత విజయ్ రూపానీ. ఆయన మృతికి తాను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ విషాదకరమైన సమయంలో ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులకు, బీజేపీ కార్యకర్తలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను” అని ఎక్స్ లో పోస్ట్ చేశారు. కాగా అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఓ మెడికల్ కాలేజీపై కూలిపోయింది. దీంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది, మెడికల్ కాలేజీ స్టూడెంట్స్, సిబ్బంది అంతా కలిపి 297 మంది మరణించారు.

Exit mobile version
Skip to toolbar