Prime9

MP Kesineni Nani : గొట్టం గాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తున్నా – ఎంపీ కేశినేని నాని

MP Kesineni Nani : విజయవాడ ఎంపీ కేశినేని నాని వ్యవహారం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి మింగుడు పడని అంశంగా మారింది.  తాజాగా విజయవాడ లోని తన ఆఫీస్ వద్ద నీళ్ల ట్యాంకర్లను ప్రారంభించిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. తెదేపా అధిష్టానంపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడుకు ఆహ్వానం కూడా అందలేదని.. విజయవాడ ఆఫీస్ ఓపెనింగ్‌కి కూడా పిలవలేదని మండిపడ్డారు.

ఇలాంటి చర్యల ద్వారా ప్రజలకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నారని ఆయన పార్టీ హైకమాండ్ ను ప్రశ్నించారు.  పార్లమెంట్ పరిధిలో గొట్టం గాళ్ళ కోసం కూడా నేను పనిచేస్తున్నా..ప్రజలకు మంచి చేసే వాళ్లకు పార్టీల నుంచి ఆఫర్లు వస్తాయి అంటూ వ్యాఖ్యానించారు. తాను ఏ లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానో తనకు తెలుసు అన్నారు. ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా తాను మాత్రం ప్రజల కోసం పని చేస్తున్నానని అన్నారు కేశినేని. ప్రజలకు కోరుకుంటే ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలుస్తారనని ధీమా వ్యక్తం చేశారు.

Kesineni Nani

గత కార్పొరేషన్ ఎన్నికల్లో తనను పార్టీ వాళ్లే గొట్టంగాడని, చెప్పుతో కొడతానని తిట్టిన విషయాన్ని నాని గుర్తు చేశారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకుంటే చాలన్నారు. లేకపోయినా నష్టం లేదని అభిప్రాయపడ్డారు. విజయవాడ ప్రజలు తనతో చాలా కంఫర్ట్‌బుల్‌గా ఉన్నారని చెప్పుకొచ్చారు. మహానాడులో తన కంట్రీబ్యూషన్ ఏమీ లేదన్నారు కేశినేని నాని. రాష్ట్రంలో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నప్పటికీ రామ్మోహన్ నాయుడికి ఉన్న ప్రయార్టీ ఎవరికీ లేదన్నారు. వేరే వాళ్ల పాత్ర అక్కడ ఏమీ కనిపించలేదని అసహనం వ్యక్తం చేశారు. ఎందుకని విలేకర్లు ప్రశ్నిస్తే ఈ విషయాన్ని చంద్రబాబునో అచ్చెన్నాయుడినో అడగాలని సూచించారు నాని.

తన వెంట ప్రజలు ఉన్నారని ప్రజల కోసం పని చేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. పొమ్మనలేక పొగబెడుతున్నారా అంటే దానికి కూడా అడగాల్సిన వాళ్లను అడగాలన్నారు. ప్రజలు అనుకుంటే ఇండిపెండెంట్‌గా గెలుస్తానన్నారు. నేను అన్ని పార్టీలతో టచ్‌లో ఉంటాను.. బీజేపీ, వైసీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కూడా టచ్ లో ఉంటానని అన్నారు. కొంతమంది ఏం చేసినా మెచ్చుకునే వారు ఉంటారు.. గిట్టని వారు ఉంటారు. నేను పార్టీల తరపున కార్యక్రమాలు చేయడం లేదు.. ప్రజల తరపున చేస్తున్నానని వెల్లడించారు.

Exit mobile version
Skip to toolbar