Prime9

Minister Chelluboina venugopala krishna : అస్వస్థతకు గురైన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ.. ఆస్పత్రిలో చేరిక

Minister Chelluboina venugopala krishna : ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అస్వస్థతకు గురయ్యారు. దాంతో వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. మధ్యాహ్నం స్వల్ప అస్వస్థతకు గురైన మంత్రి వాంతులు చేసుకున్నారు. ఇక వైద్యులు గుండె సంబంధిత పరీక్షలతో పాటు పూర్తి హెల్త్ చెకప్ చేయాలని సూచించారు. రేపు ఉదయం మంత్రి వేణుకి డాక్టర్లు వైద్య పరీక్షలు చేయనున్నారు.

మంత్రి వేణు ఆసుపత్రిలో చేరినట్లు తెలిసి వైసీపీ నేతలు, కార్యకర్తలు, ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు. దీనిపై మంత్రి కార్యాలయ వర్గాలు స్పందించాయి. మంత్రి వేణు ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాయి. మంత్రి వేణు ఆరోగ్యం గురించి వస్తున్న వార్తలపై ఆయన కుమారుడు చెల్లుబోయిన నరేన్ స్పందించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెల్లుబోయిన నరేన్ స్పష్టం చేశారు.

 

 

Exit mobile version
Skip to toolbar