Prime9

Minister Appalaraju: డాక్టర్లు లేకపోవడంతో మంత్రి అప్పల్రాజు దిగ్భ్రాంతి

Andhra Pradesh: పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి సిదిరి అప్పల్రాజు దిగ్భ్రాంతి చెందారు. అది కూడా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి వి.రజినీ పాలనలోని ఓ ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.

మంత్రి సిదిరి అప్పల్రాజు పలాస ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. 50బెడ్ల సామర్ధ్యం కల్గిన వైద్యశాలలో మంత్రి వచ్చే సమయంలో ఒక్క డాక్టరు కూడా విధుల్లో లేకపోవడంతో ఆయన షాక్ అయ్యారు. సూపరింటెండెంట్ సహా సిబ్బంది గైర్హాజరవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసారు. డాక్టర్లు సక్రమంగా రాకపోతే వందల మంది రోగుల పరిస్ధితి ఏంటని డ్యూటీ సిబ్బందిని ప్రశ్నించారు. విధులకు రానివారి అందరి పై చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్న వైద్యుల పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని మండి పడ్డారు.

అయితే గతంలో ఆసుపత్రి నిర్వహణ పై ప్రశ్నించిన ఓ డాక్టర్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం అందరికి విధితమే. చివరకు ఆయన ప్రాణాలు కూడా వదిలాడు. తాజాగా మంత్రి ఆసుపత్రిలో జరుగుతున్న వ్యవహారం పై మీడియా ముందే గట్టిగా మాట్లాడారు. వ్యవహారం పై ప్రభుత్వ పెద్దలు ఏ మేరకు నిర్ణయం తీసుకొంటారో వేచిచూడాలి.

Exit mobile version
Skip to toolbar