Prime9

Medical Student Suicide : కర్నూల్ లో మెడికో విద్యార్ధి ఆత్మహత్య..

Medical Student Suicide : పలు కారణాలతో విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలను మనం గమనిస్తూ ఉండవచ్చు. క్షణికావేశంలో వారు తీసుకొనే నిర్ణయాల కారణంగా వారి కుటుంబాలు పడే బాధను వర్ణించడం ఎవరికి సాధ్యం కాదు. ఇక ఇటీవల కాలంలో విద్యార్ధుల ఆత్మహత్య ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా కర్నూలులో మెడికో విద్యార్ధి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర సంచలనంగా మారింది. విశ్వభారతి మెడికల్ కాలేజీలో సోమవారం ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోయాడు.

ఈ ఘటన గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

విశ్వభారతి మెడికల్ కాలేజీలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేష్ అనే విద్యార్ధి థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ చదువుతున్నాడు. కాగా సోమవారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ఫ్యాన్ కు వేలాడుతున్న మృతదేహాన్ని చూసి భయాందోళనలకు గురైన తోటి విద్యార్థులు తొలుత మేనేజ్ మెంట్ కు, ఆపై పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందికి దించి పోస్టుమార్టం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇక లోకేష్‌ ఆత్మహత్య చేసుకున్న విషయంపై తండ్రి బ్రహ్మానందరావుకి సమాచారం అందించారు. ఈ విషాద వార్తతో వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, విచారణలో అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు చదువులో ఒత్తిడి కారణమా.. లేకా ప్రేమ వ్యవహారం కారణమా? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version
Skip to toolbar