Prime9

Tragedy: తీవ్ర విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు మృతి

AP: తెలుగు రాష్ట్రాల్లో ఈతకు వెళ్లి నీటిలో మునిగి చనిపోతున్న ఘటనలు పెరుగుతున్నాయని.. ఈ మధ్యే కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో స్నేహితుడి పెళ్లికి వెళ్లిన యువకులు గోదావరి స్నానానికి వెళ్లి ఎనిమిది మంది చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటన మరువక ముందే నిన్న తెలంగాణలోని భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ బ్యారెజీ వద్ద గోదావరిలో మునిగి ఆరుగురు గల్లంతయ్యారు. తాజాగా అలాంటి ఘటనే ఏపీలోని అల్లూరి జిల్లాలో జరిగింది.

 

ఏపీలో తీవ్ర విషాద ఘటన జరిగింది. సరదాగా చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు బాలురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అల్లూరి జిల్లా అరకు ఏరియా ఏజెన్సీ ప్రాంతంలోని డుంబ్రిగూడ మండలం గుంటసీమ ప్రాంతంలో జరిగింది. దీంతో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. అయితే చనిపోయిన బాలుర వివరాలు ఇంకా తెలియలేదు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివారాలు రాబడుతున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

 

Exit mobile version
Skip to toolbar