Prime9

Amaravati Farmers Padayatra: 14వ రోజుకు చేరుకొన్న రైతుల పాదయాత్ర

Andhra Pradesh: అమరావతి నుండి అరసవల్లి వరకు తలపెట్టిన రాజధాని రైతుల రెండవ మహా పాదయాత్ర 14రోజున కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుండి ప్రారంభమైంది. ఒక రాష్ట్రం, ఒక రాజధానిగా అమరావతిని గుర్తించాలని పదే పదే రైతులు నినదించారు. పెట్టుబడులు, పరిశ్రమల రాకకు అమరావతి ఓ అద్భుతమైన ప్రదేశంగా పేర్కొంటూ తమ పాదయాత్ర ఉద్ధేశాన్ని స్థానికులకు, రైతులకు తెలియచేస్తున్నారు.

అమరావతి ఐక్య కార్యచరణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాదయాత్రకు వైకాపా మినహా అన్ని పార్టీలు తమ మద్ధతును ప్రకటించాయి. తెలుగుదేశం కీలక నేతలు దేవినేని ఉమా, రావి వెంకటేశ్వర రావులు పొల్గొని రైతుల పోరాటానికి సంఘీభావం తెలిపారు. దేవుడే జగన్ కు బుద్ధి చెబుతారంటూ, అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేపడితే మరోసారి గెలిపించుకొంటామని రైతులు పేర్కొంటున్నారు. పాదయాత్ర సాయంత్రం లోపు ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.

నిన్నటిదినం గుడివాడలో పాదయాత్ర ఆధ్యంతం వేడి వాతావరణంలో కొనసాగింది. మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు పదే పదే అమరావతి రైతుల నుద్ధేశించి హేళన చేస్తూ రెచ్చగొట్టారు. దీంతో నిగ్రహం కోల్పోయిన రైతులు కూడా తొడలు కొట్టి మరీ పాదయాత్రను కొనసాగించారు. పోలీసులు పలుమార్లు జోక్యం చేసుకొని సర్ధి చెప్పే క్రమంలో రైతులనే పక్కకు తోసిపడేసారు. తొలి నుండి వైకాపా వర్గీయులు రెచ్చగొడుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తి వుండడం పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఇది కూడా చదవండి:  బతుకమ్మ పండగ ఎలా జరుపుకుంటారంటే..!

Exit mobile version
Skip to toolbar