Prime9

CM Chandrababu: అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు.. సీఎం చంద్రబాబు

CM Chandrababu and Minister Lokesh Press Meet: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై నేటికీ ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడామని, రైల్వే జోన్ సాధించుకున్నామన్నారు. అమరావతి, పోలవరం పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు.

 

కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది గడిచిందని చంద్రబాబు అన్నారు. సంపద సృష్టిస్తామని, ఆదాయాన్ని పెంచుతామని చెప్పామన్నారు. అభివృద్ధి, సంక్షేమం మాకు రెండు కళ్లు అని వివరించారు. మేనిఫెస్టోలో చెప్పినవే కాకుండా చెప్పనివీ కూడా చేస్తున్నామన్నారు. సూపర్ సిక్స్‌లో కీలకమైన తల్లికి వందనం అమలుచేస్తున్నామన్నారు. చెప్పినట్టే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుందన్నారు.

 

తల్లి వందనం పథకం లబ్ధిదారులు 67 లక్షల మంది ఉన్నారని, 42 లక్షల మందికి మాత్రమే గత ప్రభుత్వం అమ్మ ఒడి ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వంతో పోల్చితే రూ.3,500కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నామన్నారు. తల్లి లేని పిల్లలకు తండ్రి లేదా సంరక్షకుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. అలాగే అనాథ పిల్లలకు కూడా పథకం వర్తిస్తుందన్నారు.

 

పదేళ్లలో రాని పెట్టుబడులు ఏడాదిలోనే వచ్చాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. 9.8 లక్షలమందికి ఉద్యోగ అవకాశాల కోసం ఒప్పందాలు జరిగాయన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

Exit mobile version
Skip to toolbar