Prime9

AP Mega DSC: నేటి నుంచే ఏపీ మెగా డీఎస్సీ ఎగ్జామ్స్.. పకడ్బందీగా ఏర్పాట్లు..!

AP Mega DSC Exams 2025: ఏపీ మెగా డీఎస్సీ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలు శుక్రవారం ప్రారంభమై ఈనెల 30వ తేదీ వరకు కొనసాగనున్నాయి. మొత్తం 154 కేంద్రాల్లో 44 దశల్లో ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షలను రెండు విడతల్లో నిర్వహిస్తుండగా.. తొలి సెషన్ ఉదయం 9.30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4.30 నిమిషాల వరకు జరగనుంది.

 

కాగా, మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహిస్తుండగా.. డీఎస్సీకి 3,36,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆన్ లైన్ విధానంలో పరీక్షల కోసం ఏపీలో 137 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా.. హైదరాబాద్, కోదాడ, చెన్నై, బెంగళూరు, బెర్హంపూర్‌లలో 17 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష రాసేందుకు ఎగ్జామ్ సెంటర్‌లోకి తొందరగానే చేరుకోవాలని, గంటన్నర ముందు నుంచే లోపలికి అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు.

 

Exit mobile version
Skip to toolbar