Prime9

AP CM Chandrababu : మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలి : ఏపీ సీఎం చంద్రబాబు

Cabinet meeting chaired by CM Chandrababu : రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. సచివాలయంలో మంత్రివర్గ సమావేశం సందర్భంగా సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు నేరస్థులను రాజకీయ నాయకులు కలవాలంటే భయపడేవారన్నారు. ఇప్పుడు నేరస్థులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. నేరస్థులకు తాము అండగా ఉన్నామని, ప్రజలకు సందేశమిస్తూ రాజకీయాలను ఎటు తీసుకుపోతున్నారో అర్థం కావటం దుయ్యబట్టారు. ఏడాది పరిపాలన బాగుందని సంతోషం వ్యక్తం చేశారు. మంత్రులు మరింత సమర్థంగా పనిచేయాలని సూచించారు. ప్రజాసమస్యల పరిష్కారమే అజెండా కావాలని పిలుపునిచ్చారు. మరింత దూకుడు పెంచి ప్రజల్లో మమేకం కావాలని దిశానిర్దేశం చేశారు. తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని హెచ్చరించారు.

 

గత వైసీపీ ప్రభుత్వం హయాంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయట తిరగటం సబబు కాదని పలువురు మంత్రులు అభిప్రాయపడ్డారు. ఏ తప్పు చేయకుండానే టీడీపీ నాయకులను వైసీపీ ప్రభుత్వం జైలుకు పంపిందని మంత్రి సంధ్యారాణి గుర్తు చేశారు. తమను అన్యాయంగా వేధించారని, తాము వేధించడం సరికాదన్నారు. గత వైసీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై పారదర్శకంగా విచారణ జరుపుతామన్నారు. నేరం రుజువైతే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదన్నారు. రాజకీయ కక్ష సాధింపులు మన ధోరణి కాదని, ఈ తేడాను ప్రతిఒక్కరూ గమనించాలని సూచించారు. పోలవరం-బనకచర్లపై కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తోందని, ప్రాజెక్టుకు నిధుల సమీకరణ జరుగుతోందని సీఎం తెలిపారు.

 

కేబినెట్‌ నిర్ణయాలు..
-సీఆర్డీఏ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు నేబినెట్ ఆమోదం తెలిపింది.
-వివిధ సంస్థలకు చేసిన భూ కేటాయింపులు, రాయితీల కల్పనకు ఆమోదం.
-రక్షితనీటి సరఫరాకు శ్రీకాకుళంలో రూ.5.75 కోట్ల వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది.
-కుప్పంలో రూ.8.22 కోట్లు వయబిలిటి గ్యాప్‌ఫండ్‌ విడుదలకు ఆమోదం.
-సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకే ఆమోదం. 1 ఫిబ్రవరి 2025 నాటికి అర్హులైన 17 మంది యావజ్జీవ ఖైదీలకు క్షమాభిక్ష మంజూరు
-248 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతి కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం.
-వైఎస్సార్‌ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మారుస్తూ తెచ్చిన జీవోకు ఆమోదం తెలిపింది.
-పోలీసు అకాడమీకి అదనంగా 94.45 ఎకరాలు ఇచ్చేందుకు ఆమోదం.
-మహిళలు రాత్రిపూట పనిచేసే చట్టసవరణకు ఆమోదం. రాత్రిపూట పనిచేసే మహిళలకు భద్రత, రవాణా సౌకర్యం కల్పించాలి.

Exit mobile version
Skip to toolbar