Marigold Farming: ప్రస్తుత కాలంలో రైతులు తక్కువ సమయంలో పంట చేతికొచ్చే పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అలాగే రైతులు ఉద్యావవన పంటలపై ఆసక్తి చూపుతున్నారు. అందులో ముఖ్యమైనంది బంతిపూలసాగు. ఈ పంటసాగులో సరైన మెళకువలు పాటిస్తే.. రైతులు మంచి ఆదాయాన్ని ఆర్జించవచ్చు.
ఈ పంట తక్కువ సమయంలో చేతికొచ్చి ఎక్కువ ఆదాయన్ని సమకూర్చుతుంది. దీంతో ఈ పంట సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఈ సాగు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
నీరు త్వరగా ఇంకిపోయే నేలలు, గర్షె నేలలు, ఇసుక నేలలు, నీటి తేమ తక్కువగా ఉండే నేలలు బంతి సాగుకు అనువైనవి. ఈ నేలల్లో బంతి పూల పంట సాగు చేయవచ్చు. నీడ తక్కువగా ఉన్న ప్రదేశాలలో ఈ పంట అత్యధికంగా బంతిపూలను ఇస్తుంది.
తక్కువ సమయంలో పంట చేతికొచ్చి ఆదాయాన్ని సమకూర్చే బంతిపూల సాగుకు రైతులు ముందుకు వస్తున్నారు. ఎకరాకు రూ.8 వేల పెట్టుబడితో 40 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నారు. సీజన్‌కు అనుగుణంగా బంతిసాగు రైతులు కనీసం కేజీ రూ.50 నుంచి రూ.100 వరకు మార్కెట్‌లో బంతిపూలను విక్రయిస్తున్నారు. స్థానికంగా పండుగ సీజన్‌లో పూలను అమ్ముకుంటున్నారు. బంతి సాగు పెరుగుదలకు, పూల దిగుబడికి ఎక్కువ తారతమ్యాలు లేని వాతావరణం అనుకూలం. వాతావరణ పరిస్థితులను బట్టి బంతిపూల సాగు చేయవచ్చు.