Site icon Prime9

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం కావలిసిన అర్హతలు

kisan credit card prime9news

kisan credit card prime9news

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రైతుల్లో చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ చదివి పూర్తి వివారాలను తెలుసుకోండి. అసలు ఈ పథకం రైతులకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఇక్కడ చూద్దాం. ఈ కార్డు ద్వారా రైతు అవసరాన్ని బట్టి 1.6 లక్షల రూపాయల వరకు రుణాన్ని పొందవచ్చు. రైతులు తమ పొలాల్లో విత్తడం, పంటల దాణా, పంటలకు ఎరువులు వేయడం వంటి వ్యవసాయ పనులకు ఈ రుణాలను పొందడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించవచ్చు.

కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం కోసం కావలిసిన అర్హతలు..

కౌలు రైతులు, సొంతముగా భూమి ఉన్న వారు, కౌలు సాగుదారులు, సాగుదారులు, సాగుదారుల ఉమ్మడి క్రెడిట్ గ్రూపుల్లో ఉన్న రైతులు ఈ రుణాన్ని పొందవచ్చు.

దేని కొరకు కిసాన్ క్రెడిట్ కార్డ్ రుణం లభిస్తుంది?

పంటల సాగుకు అవసరమైన విత్తనాలు ఖర్చులకు, ఎరువుల ఖర్చులకు, పంట కోత తర్వాత పంటను ప్రాసెస్ చెయ్యడానికి అయ్యే ఖర్చులు, పంటకు మార్కెట్‌లో ధర వచ్చేవరకు అందుకు కావలిసిన వ్యవసాయ ఖర్చులు, రైతు ఇంటి అవసరాలకు, వ్యవసాయ పనిముట్ల మరమ్మత్తులకు, పాడి పెంపకం, గొర్రెలు, కోళ్ళ పెంపకాలకు ఈ కిసాన్ క్రెడిట్ కార్డు పై రుణాలను పొందవచ్చు.

Exit mobile version