Millets: ఆరోగ్యాన్ని కాపాడటంలో చిరుధాన్యాల పాత్ర కీలకమైంది. దీంతో చిరు ధాన్యాల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు సైతం ముందుకు వస్తున్నాయి. ఈ చిరు ధాన్యాల సాగులో సరైన మెళకువలు పాటిస్తే.. మంచి లాభాలు పొందవచ్చు.
పోషకాలు ఎక్కువగా ఉండే చిరు ధాన్యాలను సేంద్రియ పద్ధతిన సాగు చేసి.. మంచి లాభాలను ఆశించవచ్చు. సరైన సమయంలో విత్తడం.. రసాయనాలను మోతాదులో వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. మరి ఈ చిరు ధాన్యాల సాగులో ఎలాంటి మెళకువలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చిరు ధాన్యాల్లో ముఖ్యమైనవి.. (Millets)
చిరుధాన్యాలను తరచూ ఉపయోగించడం వల్ల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కొర్రలు : రాష్ట్రంలో కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అండు కొర్రలు, సజ్జలు, రాగులు, వరిగలు, జొన్నలు ఎక్కువగా సాగవుతాయి. చిరుధాన్యాలన్నింటిలోనూ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కొర్రలతో నరాలకు శక్తి, మానసిక దృఢత్వం లభిస్తుంది. కీళ్ల నొప్పులు, పార్కిన్సన్, మూర్ఛ రోగాల నుంచి విముక్తి కలిగిస్తాయి.
సామలు : సంతాన లేమి సమస్యను అధిగమించేందుకు సామలు తోడ్పడతాయి. అండాశయం, వీర్య సమస్యలు, పీసీవోడీ, ఊబకాయ సమస్యలను నివారిస్తాయి. అయితే అండు కొర్రలను కనీసం నాలుగు గంటలు నానబెట్టి వండుకోవాలి. మిగతా చిరు ధాన్యాలను రెండు గంటలైనా నానబెట్టాలి. థైరాయిడ్ సమస్యలకు చిరు ధాన్యాలు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు.
ఊదలు : కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. లివరు, కిడ్నీ, ఎండ్రోక్రెయిన్ గ్లాండ్స్‌ను ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడతాయి. అలాగే కామెర్లను తగ్గిస్తాయి.
అరికలు : అరికలు రక్తశుద్ధికి తోడ్పడటంతో పాటు రక్త హీనత, డయాబెటిస్, మలబద్ధకాన్ని తగ్గిస్తాయి.