Site icon Prime9

Viral Video : ఇవేం మేకలు బాబోయ్… సినిమా రేంజ్లో సీన్ని క్రియోట్ చేశాయి !

goat video prime9news

goat video prime9news

Viral Video : సోషల్ మీడియాలో జంతువులకు సంబంధించి ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంటుంది కుక్క పిల్లల వీడియోనో లేక ఏనుగులు వంటి జంతువుల వీడియోనో లేదంటే ఇతర జంతువుల వీడియోనో ఇలా ఏదో ఒకటి చూస్తూనే ఉంటాం.అలాగే జంతువులకు సంబంధించిన ఏదైనా వీడియోలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన వారు అందరూ షాక్ అవుతున్నారు.

అసలు ఈ వీడియోలో ఏముండో ఇక్కడ చూద్దాం
వీడియోని గమనిస్తే..ఓ ఇంటికి దగ్గర్లో 4 మేకలున్నాయి.ఏదో తింటూ ఉన్నాయి. అంతలో అటుగా ఓ ups పార్శిల్ ట్రక్ వచ్చింది. ట్రక్ డ్రైవర్.. సరిగా డ్రైవింగ్ చెయ్యలేదు.అందువల్ల మేకలు ఉన్న ఫెన్స్‌ని వాహనం చిన్నగా ఢీకొట్టింది.మేకలకు ఏమీ కాలేదు.కానీ మేకలు మాత్రం అప్పటికప్పుడు ఏం చెయ్యాలా అని అలోచించి..ఒక్కసారిగా నాలుగూ కాళ్లు విరిగినట్లుగా, చనిపోయినట్లు భలే నటించాయి. నేలపై పడి.. కాళ్లు పైకి ఎత్తి.. గడ్డకట్టినట్లుగా, శవాల్లా అలాగే ఉండిపోయాయి. ఫెన్స్‌ని ఢీకొట్టడం వల్ల యాక్సిడెంట్ జరిగినట్లుగా, తాము చనిపోయినట్లుగా మేకలు సినిమా రేంజ్లో ఇక్కడ సీన్ క్రియేట్ చేశాయి. వాటికి అన్ని తెలివితేటలు ఎలా వచ్చాయా అని ఆశ్చర్యం కలిగిస్తుంది.

Exit mobile version