Site icon Prime9

Viral Video: కుక్క పిల్లకు భయపడిన మొసలి!

mosali prime9news

mosali prime9news

Viral Video: మొసళ్ల గురించి మనం కొత్తగా చెప్పుకోవాలిసిన అవసరం లేదు. ఎందుకంటే అవి నీటిలోనూ నేల మీద కూడా ఉండగలవు. వాటి పళ్ళు కూడా చాలా గట్టిగా ఉంటాయి. వాటి నోటితో ఒకసారి ఏదైనా జంతువుని పట్టుకుంటే ఇక అంతే అసలు వదలవు. పైగా నేలపై ఉన్నా కూడా అవి చాలా వేగంగా కదలగలవు. అలాంటి మొసలికి, ఓ కుక్క పిల్లకి మధ్య జరిగిన ఎత్తుకు పై ఎత్తుకి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

వీడియోలో ఏముందో ఇక్కడ చూద్దాం..
వీడియోలో ఓ ఇంటి పక్కనే ఉన్న చెరువు నుంచి మొసలి ఒడ్డుకి వస్తోంది. దాన్ని చూసిన ఒక కుక్కపిల్ల, ఒక రోజు దాని దగ్గరకు వెళ్లి గట్టిగా అరిచింది. కుక్కపిల్లను చూసి కంగారుపడిన మొసలి నీటిలోకి వెళ్లిపోయింది. దాంతో ఆ ఇంటివారు తెగ సంతోష పడ్డారు. మా కుక్క పిల్లకి చాలా ధైర్యం ఉందని మెచ్చుకున్నారు. ఇంకో సారి కూడా ఈ సందర్భంలో మొసలి అలాగే రాగానే, అప్పుడు కూడా ఆ కుక్క పిల్ల దాన్ని అలాగే   తరిమేసింది. మొసలి వెళ్లిపోతున్నప్పుడు దాని తోకను కరిచేందుకు కుక్కపిల్ల బాగా ప్రయత్నించింది. అప్పుడు కూడా ఆ ఇంటి సభ్యులు కుక్క పిల్లని ఒకేసారి ఆకాశానికి ఎత్తేశారు. మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి, ఈ సారి మొసలి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ సారి మాత్రం కుక్క పిల్ల ఆటలు సాగలేదు. ఇంతకి ఆ మొసలి ఏం చేసిందో మీరే చూడండి.

Exit mobile version