Site icon Prime9

Viral Video: సింహం ఎప్పుడు సింహమే గురు!

lion 2 prime9news

lion 2 prime9news

Lion Viral Video: సాధారణంగా మనం ఇళ్లల్లో పిల్లులను, కుక్కలను పెంచుకుంటూ ఉంటాము. నిజానికి అడవి జంతువులని పెంచడం అంత సులభం కాదు. జూ పార్కులలో కూడా జంతువులను కంట్రోల్ చేయడానికి అక్కడ ఉండే సిబ్బంది ఎన్నో రకాలుగా బాధలు పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు వాటికి కోపం ఎక్కువై మన పై దాడి చేస్తాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహం పిల్లలకి సంబంధించిన ఒక వీడియో హల్చల్ చేస్తుంది. ఇంతకీ వీడియో ఏమిటి అని చూస్తే, ఒక వ్యక్తి కారు మీద రెండు సింహం పిల్లలను కూర్చో బెట్టి, చేతితో సింహం పిల్లని నిమురుతూ ఉండగా కానీ అప్పుడే అతను ఊహించనిది జరిగింది.

సింహం పిల్లల్లో ఒక దాన్ని నిమురుతూ ఉండగా, మరో వ్యక్తి దాన్ని తన మొబైల్‌లో షూట్ చేస్తూ ఉన్నాడు. అతన్ని చూసి ఆ సింహం పిల్ల గర్జించింది. కానీ ఆ వ్యక్తి మాత్రం చాలా తేలిగ్గా తీసుకుకొని నిమరడం ఆపలేదు. దాంతో కోపం వచ్చిన ఆ సింహం పిల్ల అతనివైపు చూస్తూ, గర్జిస్తూ అతని చెయ్యిని కొరికేందుకు ప్రయత్నించింది. దాంతో ఉలిక్కిపడిన అతను ఒక్కసారిగా దూరంగా వెళ్లాడు.

Exit mobile version