Heavy Rains in Nellore : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ద్రోణి ప్రభావంతో గత మూడు నాలుగు రోజుల నుంచి వర్షాలు బాగా కురవడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులు, వంకల పొంగి ప్రవహిస్తున్నాయి. నేడు ఉదయం నుంచి నెల్లూరులో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.