Site icon Prime9

Varahi Yatra: జూన్ 14 నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర.

janasena varahi yatra third phase tour schedule

janasena varahi yatra third phase tour schedule

Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారయింది. ఏపీలో ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ చెప్పారు. ముందుగా అన్నవరంలో పూజలు చేసి యాత్రకు బయలుదేరనున్నారు.

జనసేన యాత్ర విషయమై రూట్ మ్యాప్ ఖరారు చేసామని మనోహర్ తెలిపారు. తూర్పుగోదారవరి జిల్లాలో 10 నియోజకవర్గాల్లో వారాహి యాత్ర ఉంటుందన్నారు. ఒక్కో నియోజకవర్గంలో రెండ్రోజుల పాటు పవన్ పర్యటన ఉంటుందని పర్యటనలో భాగంగా ప్రతిరోజూ ఒక ఫీల్డ్ విజిట్ తప్పనిసరిగా ఉంటుందని తెలిపారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మిడివరం, రాజోలు, పి.గన్నవరం నుంచి నర్సాపురంలో తొలివిడత యాత్ర ఉంటుందని వివరించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో షెడ్యూల్ ఖరారు చేసామని తెలిపారు.

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ..(Varahi Yatra)

ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ క్షేత్రస్థాయిలో పర్యటిస్తారని వివిధ వర్గాలతో సమావేశమవుతారని చెప్పారు. మహిళలు, రైతులు, యువత సమస్యలు తెలుసుకుంటారనిప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు పవన్ ప్రయత్నిస్తున్నారని మనోహర్ తెలిపారు. కల్లుగీత కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, రైతులు, డ్వాక్రా సంఘాలు, మత్స్యకార సంఘాలతో భేటీ అవుతారని చెప్పారు. జనసేన ద్వారా ప్రజలకు భరోసా కల్పించేలా యాత్ర ఉంటుందని అన్నారు. జనసేన ద్వారా క్షేత్రస్థాయిలో మార్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు.వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జనసేనలో చేనేత వికాస విభాగం ఏర్పాటు చేశామని తెలిపారు.

Exit mobile version