Pawan Kalyan: ఏపీలో మే 13న జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ గెలుపు కోసం క్షేత్ర స్థాయిలో ఇంటింటికీ వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసిన జనసేన వీర మహిళల సేవలు మరువలేనివని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు .ఈ మేరకు ఒక లేఖను విడుదల చేసారు . ఈ సందర్భంగా ఎన్నికల్లో వీర మహిళలు చేసిన సేవను కొనియాడారు. సమాజంలో మార్పు రావాలంటే ముందు మహిళల్లో రాజకీయ చైతన్యం రావాలి అనేది జనసేన బలంగా నమ్మే సిద్ధాంతమని , అందుకే పోరాటానికి ప్రతిరూపమైన వీర నారీ ఝాన్సీ లక్ష్మీబాయి స్పూర్తితో వీర మహిళ విభాగం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు . రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి మండుటెండను లెక్కచేయకుండా పిఠాపురంలో నా తరపున ఆడపడుచులు చేసిన ప్రచారం, అందించిన తోడ్పాటుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ప్రతీ ఒక్కరినీ గుర్తించే భాధ్యత జనసేన తీసుకుంటుంది, వారిని బలమైన మహిళా నాయకులుగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తీసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేసారు .
డి.కె.చైతన్యకి అభినందనలు..( Pawan Kalyan)
అదే విధంగా ఇటీవలే పార్టీలో చేరిన డి.కె. ఆదికేశవులు నాయుడు మనుమరాలు డి.కె. చైతన్య స్వచ్చందంగా పిఠాపురం వచ్చి నెల రోజుల పాటు ప్రచారం చేపట్టిన తీరు అభినందనీయం అని అన్నారు . పార్టీ విజయం కోసం కష్టపడిన చైతన్యకు ధన్యవాదాలు అని ఆ లేఖలో పేర్కొన్నారు