North korea vs South korea: దక్షిణ కొరియాను కవ్విస్తోంది ఉత్తర కొరియా. డీమిలిటరైజ్డ్ జోన్ ను దాటి దక్షిణ కొరియా భూభాగంలోకి చొచ్చుకు వచ్చారు. దీన్ని దక్షిణ కొరియా తీవ్రంగా ప్రతిఘటించింది. వెంటనే వారిని హెచ్చరిస్తూ గాల్లో కాల్పులు కూడా జరిపింది. దీంతో ఉత్తర కొరియా సైనికులు పారిపోయారు. కాగా ఇలాంటి సంఘటన జరగడం ఈ నెలలో ఇది మూడోసారి. ఇదిలా ఉండగా ఇరు దేశాలను వేరు చేసే ప్రాంతం .. డిమిలిటైరైజ్డ్ జోన్ నుంచి తరచూ ఉత్తర కొరియా సైనికులు దక్షిణ కొరియాలో ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంటాయి. కాగా గురువారం దక్షిణ కొరియా సైనికులు మౌఖిఖంగా హెచ్చరించారు. అటు తర్వాత గాల్లో కాల్పులు జరిపి హెచ్చరించారని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాప్ శుక్రవారం నాడు మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
24 ఏళ్ల తరువాత ఉత్తర కొరియా గడ్డ పై రష్యా అధ్యక్షుడు..(North korea vs South korea)
కాగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉత్తర కొరియా పర్యటన ముగించుకుని వెళ్లిన కొద్ది గంటల్లో ఈ ఘటన జరిగింది. 24 సంవత్సరాల తర్వాత రష్యా అధ్యక్షుడు ఉత్తర కొరియా గడ్డపై కాలు మోపారు. పుతిన్ తన పర్యటనలో కిమ్ జాంగ్ ఉన్‌తో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాటిలో ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇరు దేశాల్లో ఏ దేశంపైన ఇతర దేశాలు దాడులకు పాల్పడితే మరో దేశంలో ఆదుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. అయితే పుతిన్ ఉత్తర కొరియా రాక ముందు నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దక్షిణ కొరియా సరిహద్దుకు ఉత్త ర కొరియా పెద్ద సంఖ్యలో సైనికులను పంపుతూ ఆ ప్రాంతంలోమందుపాతరలను పెడుతోంది. యుద్ధ ట్యాంకులను మొహరిస్తోంది. రోడ్లను మరమ్మతు చేస్తోందని దక్షిణ కొరియా మిలిటరీ అధికార ప్రతినిధి చెప్పారు.
ఇదిలా ఉండగా ఉత్తర కొరియా నియంత కియ్ సోదరి కిమ్ యో జాంగ్ శుక్రవారం నాడు ఒక ప్రకటనలో.. ఉత్తర కొరియా నుంచి పెద్ద మొత్తంలో బెలూన్లలో చెత్త నింపి దక్షిణ కొరియాకు పంపుతామని హెచ్చరించారు. అయితే ఉత్తర కొరియా నుంచి పారిపోయి దక్షిణ కొరియాలో తలదాచుకుంటున్న కొంత మంది బెలూన్లలో చెత్త నింపి ఉత్తర కొరియాకు పంపడంతో పాటు ఉత్తర కొరియాలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని.. నిరంకుశ పాలనను విమర్శిస్తూ బెలూన్లతో పటు కరపత్రాలను పంపుతోంది. ఇది కిమ్ సోదరికి ఆగ్రహం తెప్పించింది.
ఇరు దేశాలు దేశ సరిహద్దులో వేలాది మంది సైనికులను మోహరించాయి. పొరపాటును చిన్న పాటి కాల్పులు జరిగినా.. పెద్ద ప్రమాదం ముంచుకొచ్చే పరిస్థితి కనిపిస్తోంది. దక్షిణ కొరియాకు అండగా అమెరికా 28,500 సైనికులు మొహరించి ఉన్నారు. ప్రస్తుతం దక్షిణ కొరియా ఒక వైపు చైనా నుంచి మరో వైపు ఉత్తర కొరియా నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా దక్షిణ కొరియాకు అమెరికా అండగా ఉండగా. ఉత్తర కొరియాకు రష్యా అండగా ఉంటోంది.