Ram Gopal Varma: సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ, సినీ నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌తోపాటు ఏపీ డీజీపీ కార్యాలయానికి వెళ్ళారు. అమరావతి ఉద్యమ నేత కొలికిపూడి శ్రీనివాస్ తనపై చేసిన వ్యాఖ్యలపై రాంగోపాల్ వర్మ డీజీపీకి ఫిర్యాదు చేశారు. రామ్ గోపాల్ వర్మ వర్మ తల తెస్తే కోటి రూపాయల బహుమానం ఇస్తానని కొలికిపూడి చేసిన వ్యాఖ్యలని ఫిర్యాదులో ప్రస్తావించారు. వ్యూహం సినిమాని దృష్టిలో పెట్టుకుని కొలికిపూడి ఈ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ భయపడుతోంది..( Ram Gopal Varma)
అనంతరం వర్మ విజయవాడలో మీడియాతో మాట్లాడారు. నా తల తెస్తే కోటిరూపాయలు ఇస్తానంటూ కొలికపూడి టీవీ లైవ్ లో కాంట్రాక్ట్ ఇచ్చారు. యాంకర్ వారిస్తున్నా వినకుండా అదే మాటను మూడు సార్లు చెప్పారు. ఈ వ్యాఖ్యల వల్ల మిగిలిన వారు కూడా ప్రభావితం అయ్యే అవకాశముంది. ఏ చానెల్లో ఈ వ్యాఖ్యలు చేసారో ఆ టీవీ చానల్ ఎండీ కూడా ఈ కుట్రలో భాగస్వామి . అందువలన కొలికపూడి, ఛానల్ ఎండీ బిఆర్ నాయుడు, యాంకర్ సాంబశివరావులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసానని వర్మ చెప్పారు. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేశ్, పవన్ ఖండించలేదని అన్నారు. వ్యూహం సినిమాకు టీడీపీ భయపడుతోందని చెప్పారు.