Site icon Prime9

CM Revanth Reddy: 90 రోజుల్లో 30వేల ఉద్యోగాలు.. సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy Distributes Appointment Letter: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్‌లోని శిల్పారామంలో నిర్వహించిన ఉద్యోగుల సభలో మాట్లాడారు. కొత్తగా 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించామన్నారు. గత ప్రభుత్వం ఉద్యోగ నియామకాలను పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

పదేళ్లుగా ఉద్యోగాల కోసం నిరీక్షించారన్నారు. అందుకే నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచి గెలిపించారన్నారు. ఉద్యోగుల కళ్లల్లో సంతోషం చూడాలనే దసరాకు ముందే నియామక పత్రాలు అందజేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తెలంగాణ కోసం వందలాది విద్యార్థులు, నిరుద్యోగులు ఆత్మబలిదానాలు చేసుకున్నారని గుర్తుచేశారు.

తెలంగాణ భవిష్యత్తులో ఇంజినీర్లదే కీలక పాత్ర అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. నాటి ఇంజినీర్లు హైదరాబాద్ నగరంలో అద్భుతమైన కట్టడాలు నిర్మించారన్నారు. గత ప్రభుత్వమే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిందని, బీఆర్ఎస్ హయాంలోనే ఆ ప్రాజెక్టు కూలిపోయిందన్నారు. మల్లన్నసాగర్‌లో 50 టీఎంసీలు నింపితే..అది కూలిపోతుంది నిపుణులు నివేదిక ైతం ఇచ్చారని చెప్పారు. గత 20 ఏళ్లుగా పేదల్లో ఉన్న తనకు పేదోడి దు:ఖం తెలియదా? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

ఇళ్లు కూలితే ఎంత బాధ ఉంటుందో జెడ్పీ మెంబర్ నుంచి సీఎం అయిన నాకు తెలుసన్నారు. వాళ్లను ఎలా ఆదుకోవాలో చెప్పాలన్నారు. గత ప్రభుత్వం రూ.7లక్షల కోట్లు అప్పు చేసిందని, పేదల కోసం మరో రూ.10వేల కోట్లు ఖర్చు చేసి మూసీ బాధితులను ఆదుకోలేమా? అన్నారు. మల్లన్న సాగర్, రంగనాయకసాగర్‌లో ప్రజలు నిర్వాసితులు కాలేదా? అన్నారు. నిర్వాసితులను ఏ విధంగా ఆదుకుంటామో చెప్పాలన్నారు. మూసీలో ఉంటున్న పేదల జీవితాలు బాగుపడొద్దా? అని ప్రశ్నించారు. మూసీ ప్రాంతంలో మొత్తం 10వేల కుటుంబాలు ఉన్నాయని, ఎవరు అడ్డుపడినా మూసీ ప్రక్షాళన ఆగదని, మూసీ మురికిని ప్రక్షాళన చేయాలనుకుంటున్నట్లు చెప్పారు.

Exit mobile version