Nepal: నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
ఏడుగురు భారతీయుల మృతి..(Nepal)
చిట్వాన్ జిల్లాలోని నారాయణ్‌ఘాట్-ముగ్లింగ్ రహదారి వెంబడి సిమల్తాల్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో త్రిశూలి నదిలో గల్లంతయ్యారని నేపాల్ న్యూస్ పోర్టల్ మైరెపబ్లికా నివేదించింది.మరణించిన ఏడుగురు భారతీయులను తీసుకెళ్తున్న బస్సులలో ఒకటి బిర్‌గంజ్ నుండి ఖాట్మండుకు వెళ్తోంది..గత కొన్ని రోజులుగా నేపాల్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో, వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడుతున్నాయి, దీనితో పలు చోట్ల రోడ్లు మరియు హైవేలు మూసివేయబడ్డాయి. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా కొన్నిసార్లు రెస్క్యూ కార్యకలాపాలకు ఆటంకం ఏర్పడింది. కొండచరియల నుండి శిధిలాల కారణంగా నారాయణఘాట్-మగ్లింగ్ రహదారి విభాగంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ మాట్లాడుతూ, ఈ సంఘటన పట్ల తాను చాలా బాధపడ్డానని ప్రయాణీకులను గాలించి రక్షించాల్సిందిగా ప్రభుత్వ ఏజెన్సీలను ఆదేశించామని తెలిపారు.