Site icon Prime9

Viral News : ఫస్ట్ నైట్ తర్వాత ఊహించని రీతిలో నవ వధువు మృతి.. కారణం తెలిసి ఖంగుతిన్న కుటుంబ సభ్యులు

viral news about newly bride unexpected death due to water geaser

viral news about newly bride unexpected death due to water geaser

Viral News : పెళ్లి అనేది అమ్మాయి లైఫ్ ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది.

ఎన్నో ఆశలు మరెన్నో కలలతో తన నూతన జీవితాన్ని ప్రారంభిస్తుంది ఆమె.

అయితే ఓ అమ్మాయి తన కొత్త జీవితాన్ని ప్రారంభించేలోపే నూరేళ్లూ నిండిపోయాయి.

ఫస్ట్ నైట్ అయ్యింది.. ఎంతో సంతోషంగా మరునాడు ఉదయాన్నే లేచి తలస్నానానికి బాత్రూంలోకి వెళ్లింది.

అంతే ఎంతకీ బాత్రూమ్ నుంచి రాలేదు. తీరా ఇంట్లో వాళ్లు వెళ్లి చూస్తే ఆమె అపస్మారక స్థితిలోకి ఓ మూలన పడిపోయి ఉంది.

దీనికంతటీ కారణాలేంటని చూస్తే దిమ్మతిరిగే నిజం బయటపడింది. కేవలం గీజర్ వల్లే ఆ నవవధువు మరణించింది.

మరి ఇంతటి ప్రమాదానికి వేడినీళ్లు ఇచ్చే గీజర్ ఎలా కారణమయ్యిందో తెలుసుకుందాం.

(Viral News)నవ వధువు మృతికి కారణం ఏంటంటే..

గ్యాస్ గీజర్‌ లోని కార్బన్ మోనాక్సైడ్‌ను లీక్ కావడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా తెలుస్తుంది.

ఇది పీల్చిన కొద్ది నిమిషాల్లోనే బాధితులు మృతి చెందే అవకాశం ఉంది.

ఈ గ్యాస్ చాలా ప్రమాదకరమైనది.

ఈ గ్యాస్ పీల్చిన మరుక్షణమే మైకంలోకి జారుకుంటారు. ఆ తర్వాత అపస్మారక స్థితిని వెళ్లిపోతారు.

అయితే వెంటనే గుర్తించి వైద్యులకు చూపిస్తే ప్రాణాలు రక్షించే అవకాశం ఉంది.

ఈ కారణంగానే నవ వధువు మృతి చెందినట్లు వైద్యులు గుర్తించారు.

అయితే, కొన్ని సందర్భాల్లో శాశ్వతంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

అయినప్పటికీ, చాలా సందర్భాలలో కొన్ని నెలలపాటు ఉపయోగించే యాంటీ-సీజర్ మందులతో చికిత్స చేయవచ్చు.

ఐదు నిమిషాలకు పైగా గ్యాస్‌ను పీల్చడం వల్ల తలతిరగవచ్చు. ఇది ఎక్కువసేపు ఉంటే ముందుగా స్పృహ కోల్పోవచ్చు.. ఆ తర్వాత ఊపిరాడక చనిపోవచ్చు.

అయితే, గ్యాస్ గీజర్‌ని ఉపయోగిస్తున్నవారు తప్పకుండా వారు వినియోగిస్తున్న బాత్‌రూమ్‌లో బాగా వెంటిలేషన్ ఉండేలా చూసుకోవలి.

మంచి గాలి వచ్చే బాత్‌రూమ్‌లో మాత్రమే స్నానం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

గ్యాస్ గీజర్‌ను సురక్షితంగా ఎలా ఉపయోగించాలి ?

గీజర్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.

ఏవైనా లీక్‌లు ఉంటే వెంటనే సరిచేయాలి.

గీజర్ ఉన్న బాత్‌రూమ్‌లో తప్పకుండా ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవలి.

గీజర్ పని చేస్తున్నప్పుడు దాన్ని ఆన్ చేయండి.

లీక్ ఉంటే ఉపయోగించవద్దు

బాత్రూంలో కనీసం ఒక కిటికీ ఉండేలా చూసుకోండి

మీకు ఊపిరాడినట్లు అనిపించినా లేదా ఒక్క సెకను కూడా దగ్గడం ప్రారంభిస్తే.. వెంటనే స్వచ్ఛమైన గాలి కోసం  బయటకు వెళ్ళాలి

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version