Two villages: దున్నపోతు కోసం రెండు గ్రామాల పోరాటం.. వినడానికి విచిత్రంగా ఉంది కదా.. ఇది నిజమే. ఓ వైపు తెలుగు రాష్ట్రాల ప్రజలు సంక్రాంతి పండగను ఎంజాయ్ చేస్తుంటే.. రెండు గ్రామాలు
మాత్రం ఓ దున్నపోతు కోసం పోరాటం చేస్తున్నాయి. దున్నపోతు మాదంటే మాదని.. వాదిస్తున్నాయి. ఇంతకి ఇది ఎక్కడ జరిగిందో తెలుసా.. అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.
సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. తెలుగు రాష్ట్రాల ప్రజలు పనులను పక్కనపెట్టి పండగను ఘనంగా జరుపుకుంటారు. కానీ ఈసారి మాత్రం ఓ రెండు గ్రామ ప్రజలు పండగకు దూరంగా ఉన్నారు. దీనికి ఓ విచిత్రమైన కారణం ఉంది. అదేంటంటే ఓ దున్నపోతు. అవును దానివల్లే ఈ సారి పండగకు ఈ రెండు గ్రామాలు దూరంగా ఉన్నాయి. ఈ దున్నపోతు సమస్య పెద్ద మనుషుల స్థాయి నుంచి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది.
అనంతపురం జిల్లా రాయదుర్గంలోని అంబాపురం, రచ్చుమర్రి గ్రామాల మధ్య చిచ్చు నెలకొంది. పదేళ్లకోసారి ఈ రెండు గ్రామాల్లో ఊరిదేవర జరపడం ఆనవాయితీ. సంక్రాంతి అయినా నెల తర్వాత అమ్మవారి పేరుమీద దున్నపోతును కొనుగోలు చేసి వదిలిపెడతారు. పదేళ్ల క్రితం ఊరిదేవర పండగ తర్వాత దున్నపోతును మళ్లీ అమ్మవారి పేరున వదిలారు. అయితే నెల తర్వాత రెండు గ్రామల ప్రజలు ఊరి దేవర జరిపేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు.
ఈనెల 17న అంబాపురంలో ఊరిదేనర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బొమ్మనహల్ మండలం కులగానహళ్లి లో కనిపించిన దున్నపోతును తీసుకెళ్లారు. ఈ దున్నపోతు తమదేనంటూ ఉద్దేహళ్ గ్రామస్తులు ఆందోళన చేశారు. ఆ పోతు తమదేనంటూ ఉద్దేహళ్ గ్రామస్థులకు అంబాపురం వాసులు నచ్చజెప్పారు. అయితే దీని తర్వాతే అసలు రచ్చ మెుదలైంది. మధ్యలో రుచ్చుమర్రి గ్రామస్థులు వచ్చి దున్నపోతు తమదేనంటూ నిరసన చేపట్టారు. దీంతో పది రోజులుగా ఈ రెండు గ్రామాల మధ్య వివాదం కొనసాగుతుంది.
దున్నపోతు కోసం రెండు గ్రామాలు పోరాటం చేస్తున్నాయి.
పంచాయితీలు జరిగిన ఫలితం లేకపోవడంతో పోలీస్ స్టేషన్ వరకు వెళ్లారు.
అంబాపురం వాసులు మాట్లాడుతూ ఊరిదేవర కోసం తేదీ కూడా ఎంపిక చేశామని.. ఇప్పుడు ఇలా అనడం సరికాదని వాదించారు.
మరో రెండు నెలల్లో తమ పండగ ఉందని.. ఆ పండగను ఎలా జరుపుకోవాలని రచ్చుమర్రి గ్రామ ప్రజలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
ఎవరు వెనక్కి తగ్గకపోవడంతో పంచాయితీ పోలీస్ స్టేషన్ వరకు చేరుకుంది. ఈ వివాదంలో పోలీసుల ప్రయత్నాలు కూడా విఫలం అయ్యాయి.
పంచాయితీ చెప్పలేక తలలు పట్టుకున్న పోలీసులు.
దున్నపోతు కోసం తాము ఎందాకైనా సిద్దమన్న రెండు గ్రామాల ప్రజలు
ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకుంటున్న గ్రామస్థులు
అంబాపురంలో రేయింబవళ్లు దున్నపోతుకు కాపాల.
గ్రామంలో కొత్త వ్యక్తుల కదలికలపై నిఘా.
వాయిదా పడిన సంక్రాంతి వేడుకలు
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/