Site icon Prime9

Viral Video: యువతి చెవిలో దూరిన పాము.. ఎలా బయటకు తీసారంటే..

Snake-Gets-Trapped-in-Woman-s-Ear

Snake Gets Trapped in Woman s Ear: సర్వసాధారణంగా చెవిలో చిన్నచిన్న పురుగులు, చీమలు దూరడం దాని వల్ల కలిగే నొప్పి, బాధను అనుభవించడం లాంటి సమస్యను మనం ఎదుర్కొనే ఉంటాం. ఇంక ఆ నొప్పి వర్ణనాతీతం. ఆ బాధను అనుభవిస్తే గానీ తెలియదు. అలాంటిది పాము చెవిలో దూరితే ఎలా ఉంటుంది. పామును చూస్తేనే ఒళ్లు గగుర్పొస్తుంది కొందరి కానీ ఓ అమ్మాయి చెవిలో ఏకంగా పాము దూరింది. ఇప్పుడా వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

ఓ యువతి చెవిలో పాము పిల్ల దూరింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పాము తలపైకి ఉండగా శరీర భాగమంతా చెవిలోకి ఇరుక్కు పోయి ఉండడం పైన చూపిన ఫొటోలో మనకు కనిపిస్తుంది. ఓ వైద్యుడు పటకార్ తో ఆ పామును బయటికి తీసేందుకు ప్రయత్నిస్తుండడం కనిపిస్తుంది. కానీ ఆ పాము తలభాగం కూడా చెవి రంధ్రం లోపలికి వెళ్లిపోతుందేమోనని ఆ డాక్టర్ భయపడడం ఆ ఫొటోలో కనిపిస్తుంది. ఆఖరికి రెండు పటకార్లను ఉపయోగించి చెవిలోని పామును తీసేందుకు వైద్య నిపుణుడు ప్రయత్నిస్తుంటాడు, కాగా ఆ వీడియో మొత్తాన్ని ఓ యువతి ఇన్ వేదికగాలో పోస్ట్ చేసింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ అయ్యింది. చెవిలో నుంచి పామును బయటికి తీశారో లేదో తెలియదు కానీ ఆ వీడియో చూసిన నెటిజన్లు మాత్రం వామ్మో ఇదెక్కడి విడ్డూరం పాము చెవిలో దూరేంతవరకు ఆ యువతి ఏం చేస్తుందంటూ భయపడుతున్నారు.

 

Exit mobile version