Trainee IAS VIP Demands: మహారాష్ట్రలోని ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సివిల్ సర్వెంట్‌గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై వాషిమ్‌కు బదిలీ చేయబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పూజ ఖేద్కర్ ప్రొబేషన్ అధికారులకు ఇవ్వని సౌకర్యాలను వినియోగించుకోవడంతో వివాదం చెలరేగింది.
ఆమె తన ప్రైవేట్ ఆడి కారుపై ఎరుపు-నీలం రంగు దీపం మరియు మహారాష్ట్ర ప్రభుత్వం అని రాసి ఉన్న బోర్డును ఉపయోగించారు. అదనపు కలెక్టర్ అజయ్ మోర్ లేని సమయంలో ఆయన ఛాంబర్‌లో ఆమె కూర్చుని తన ఆఫీసుగా వాడుకున్నారు. గుర్తించారు. అంతేకాదు అక్కడ ఉన్న ఆఫీసు ఫర్నిచర్‌ను తీసేసారు. తన పేరు మీద లెటర్‌హెడ్, నేమ్‌ప్లేట్ మరియు ఇతర సౌకర్యాలను అందించమని రెవెన్యూ అసిస్టెంట్‌ని కూడా కోరారు. పూణే కలెక్టర్ సుహాస్ దివాసే రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఈమె వ్యవహారశైలిపై చీఫ్ సెక్రటరీకి లేఖ రాయడంతో ఆమె పూణే నుండి వాషిమ్‌కు బదిలీ అయింది. మరోవైపు రిటైర్డ్ అడ్మినిస్ట్రేటివ్ అధికారి అయిన శ్రీమతి ఖేద్కర్ తండ్రి కూడా ఆమె డిమాండ్లను నెరవేర్చేలా చూడాలని జిల్లా కలెక్టర్ కార్యాలయంపై ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం.