Priyanka Chopra : గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా గురించి కొత్తగా పరిచయాలు అక్కర్లేదు అని చెప్పాలి.
తన నటనతో, అందంతో బాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ.
ప్రియాంక తెలుగులో రామ్ చరణ్ సరసన తుఫాన్ అనే చిత్రంలో నటించింది.
ఈ సినిమా హిందీలో ‘జంజీర్’గా విడుదలైంది. ఈ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఈ మూవీ అమితాబ్ ఆల్ టైమ్ క్లాసిక్ ‘జంజీర్’ మూవీకి రీమేక్ గా తెరకెక్కింది.
ఆ తర్వాత హలీవుడ్ చిత్రాల్లో కూడా తన సత్తాను చాటుతూ గ్లోబల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది.
హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనస్‌ను ప్రియాంకా చోప్రా పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది ఈ భామ.
అయితే ప్రియాంక చోప్రా ఎట్టకేలకు తన కూతురు ఫేస్ రివీల్ చేసింది.
ఇక వీరిద్దరికి గత ఏడాది జనవరిలో ఒక పాప కూడా పుట్టింది.
అయితే ఆ పాపని మాత్రం ప్రియాంక ఇప్పటి వరకు చూపించకుండా సీక్రెట్ గా వచ్చింది.
సోషల్ మీడియాలో కూతురు మాల్తీ మేరీకి సంబంధించిన ఫోటోలు పెడుతూ వచ్చినా ముఖం కనబడకుండా జాగ్రత్తలు తీసుకుంది.
తాజాగా ఒక హాలీవుడ్ ఈవెంట్ కి హాజరయ్యిన ప్రియాంక.. అక్కడి ఫొటోలతో మాల్తీ ఫేస్ ని రివీల్ చేసింది.
జొనాస్ బ్రదర్స్ వాక్ అఫ్ ఫేమ్ ఈవెంట్ లో ప్రియాంక ఒళ్ళో కూర్చొని చిరునవ్వులు చిందిస్తున మాల్తీ క్యూట్ ఫోటోలు బయటకి వచ్చాయి.
నెట్టింట వైరల్ గా ప్రియాంక కుమార్తె ఫోటోలు..
కాగా ప్రియాంక చోప్రా సరోగసీ ద్వారా మాల్తీకి జన్మనిచ్చింది.
దీంతో ప్రియాంక నెటిజెన్లు నుంచి తీవ్ర విమర్శలు ఎదురుకుంది.
అందం తగ్గుతుందనే భయంతోనే ప్రియాంక సరోగసీకి వెళ్ళింది అంటూ ట్రోల్ చేశారు.
ఇక ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ప్రియాంక ఈ విషయం గురించి స్పందించింది.
తనకి ఆరోగ్య సమస్యలు ఉండడం వల్ల సరోగసీకి వెళ్లినట్లు వెల్లడించింది.
కానీ అది తెలుసుకోకుండా సోషల్ మీడియాలో విమర్శలు చేయడం వలనే తన కూతురు ముఖాన్ని పరిచయం చేయడం లేదని చెప్పుకొచ్చింది.
అంతేకాదు తన కూతురికి సరోగసీ ద్వారా జన్మనివ్వడానికి ఒప్పుకున్న వ్యక్తి పేరు వచ్చేలా తన కూతురికి పేరు పెట్టినట్లు వెల్లడించింది.
అయితే సరోగసీ ద్వారా తల్లి అవ్వడంతో ప్రియాంక చోప్రా తీవ్ర విమర్శలు ఎదురుకుంది.
దీని పై ఇప్పటి వరకు స్పందించని ప్రియాంక మొదటిసారి దీని గురించి మీడియా ముందు మాట్లాడింది.
నా కూతురు మాల్తీ పుట్టిన సమయంలో తను బ్రతుకుతుంది అని అనుకోలేదు.
తను పుట్టినప్పుడు నా చెయ్యి అంత సైజులో కూడా లేదు. అందువల్ల తనని కొన్ని రోజులు పాటు ఇంటెన్సివ్ కేర్ లో పెట్టవలసి వచ్చింది.
మాల్తీ ఇంక్యుబేటర్ లో ఉన్నంత కాలం తనని అలా చూసి చాలా బాధ పడ్డాం నేను, నిక్.
నేను సరోగసీ ద్వారా తల్లి అయ్యానని చాలా మంది చాలా విధంగా అన్నారు. ఆ ట్రోలింగ్స్ కి నా బిడ్డ గురి కాకూడదు అని తన పేస్ ని ఇప్పటి వరకు బయటకి రెవీల్ చేయలేదు.
అందం తగ్గుతుందని నేను సరోగసీకి వెళ్లినట్లు అందరు అనుకుంటున్నారు. కానీ నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.
అందువల్లే సరోగసీకి వెళ్లాల్సి వచ్చింది. సరోగసీ అంత ఏమి ఈజీ కాదు. దాని కోసం నేను, నిక్ చాలా కాలం వెతికాం.
చివరికి ఒక మహిళ ఒప్పుకుంది. ఆమె సహాయానికి గుర్తుగా నా కూతురికి నా పేరుతో పాటు ఆమె పేరు కూడా వచ్చేలా పేరు పెట్టుకున్నాను అంటూ వెల్లడించింది.
ప్రస్తుతం ప్రియాంక పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/