Actor Darshan in Tears: తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయి బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్న నటుడు దర్శన్ సోమవారం తన భార్య, కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.జైలులో ఉన్న దర్శన్ ను అతని భార్య విజయలక్ష్మి, కుమారుడు వినీష్, నటుడు టైగర్ ప్రభాకర్ కుమారుడు వినోద్ కలిసారు.
బెయిల్ గురించి చర్చలు..(Actor Darshan in Tears)
సోమవారం తన భర్త దర్శన్ ను కలిసేందుకు వచ్చిన విజయలక్ష్మి జైలు గేటు వద్ద మీడియాను చూసిన తరువాత లోపలికి వెళ్లడానికి అక్కడ పోలీసుల సాయం కోరారు. దీనితో పోలీసులు ఆమెను తమ వాహనంలో లోపలికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా వారిని చూసిన దర్శన్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలిసింది. దర్శన్ బెయిల్ పిటిషన్ గురించి భార్య విజయలక్ష్మి ఆయనతో చర్చించారు. అనంతరం వినోద్ ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ మేం పెద్దగా మాట్లాడుకోలేదు. అతను నన్ను చూసిన తర్వాత, అతను ‘హాయ్ టైగర్’ అని చెప్పాడు మరియు నేను ‘హాయ్ బాస్’ అని రిప్లై ఇచ్చాను అని తెలిపారు. ఒక స్నేహితుడిగా అతడిని చూడటానికి నేను వచ్చాను. ఈ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు.
రూ.70 లక్షలు స్వాధీనం..
మరోవైపు రేణుకాస్వామి హత్యకేసును విచారిస్తున్న పోలీసులు దర్శన్ ఇంటి నుండి మరియు ఇతర నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న డబ్బు మూలాన్ని విచారించాలని ఆదాయపు పన్ను శాఖకు లేఖ రాశారు. ఇప్పటి వరకు మొత్తం రూ.70.4 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో దర్శన్ ,ఇతర నిందితులు పంపిన కాల్ వివరాలు, సందేశాలను కూడా పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఘటన దర్శన్ కు రూ.40 లక్షలు ఇచ్చినట్లు చెబుతున్న మోహన్ రాజ్‌ను వారు ఇంకా ప్రశ్నించలేదు.ఈ సందర్బంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ రేణుకాస్వామి ఫోన్ ను తాము ఇంకా స్వాధీనం చేసుకోలేదన్నారు. అతని ఇన్ స్టా గ్రామ్ ఖాతాలనుంచి డేటాను ఇంకా పరిశీలించవలసి ఉందని చెప్పారు.