Site icon Prime9

Job Application: ఉద్యోగం ఇవ్వకపోతే చిన్ననాటి ప్రియురాలిని పెళ్లి చేసుకోలేను.. ఒక యువకుడి దరఖాస్తు..

Job Application

Job Application

Job Application: ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఓ యువకుడు .. తన దరఖాస్తును తిరస్కరిస్తే.. చిన్నప్పుడు ప్రేమించిన ప్రియురాలిని పెళ్లి చేసుకొను అని కండిషన్‌ పెట్టాడు. ఈ ఫన్నీ దరఖాస్తు ఈ నెల 13న మైక్రో బ్లాగింగ్‌ ఫ్లాట్‌ఫాంలో షేర్‌ చేయడం జరిగింది. ఇప్పటికి సుమారు 22 లక్షల మంది ఈ దరఖాస్తును చూశారు. నాలుగు వేల మంది లైక్‌లు కూడా చేశారు. ఇక అసలు విషయానికి వస్తే ఆర్వా హెల్త్‌ వ్యవస్థాపకులు.. సీఈవో దీపాలి బజాజ్‌ … తనకు వచ్చిన జాబ్‌ అప్లికేషన్‌ను మైక్రోబ్లాగింగ్‌ ప్లాట్‌ఫాంలో అప్‌లోడ్‌ చేశారు. అప్పటి నుంచి ఇంటర్నెట్‌లో ఈ దరఖాస్తు నవ్వులు పూయిస్తోంది. కాగా మిస్‌ బజాజ్‌ పుల్‌ స్టెక్‌ ఇంజినీర్‌ ఉద్యోగం కోసం ప్రకటన ఇచ్చారు. ఇక్కడ పుల్‌ స్టెక్‌ ఇంజినీర్‌ అంటే హై లెవెల్‌ స్టాప్‌ వేర్‌ ఇంజినీర్‌, డిజైన్‌, టెస్ట్‌, స్టాఫ్‌వేర్‌ అప్లికేషన్‌ ఇంప్లిమెంటేషన్‌ వరకు చూడాల్సి ఉంటుంది. ఇక సీఈవో దరఖాస్తులను పరిశీలిస్తున్నప్పుడు ఈ ఫన్నీ అప్లికేషన్‌ ఆమె కంటపడింది.

ఇక దరఖాస్తు చేసిన అభ్యర్థిని తాను ఆఫర్‌ చేసే జాబ్‌కు నీ అర్హత ఏమిటని అని ప్రశ్నిస్తే.. తనకు అత్యవసరంగా జాబ్‌ కావాలని తన కలల డ్రీమ్‌ గర్ల్‌ను పెళ్లి చేసుకోవాలంటే ఉద్యోగం కావాలని సీఈవోను కోరాడు. యువతి తండ్రి మాత్రం ఉద్యోగం ఉంటేనే పెళ్లి చేస్తాను. లేదంటే లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. అందుకే తనకు ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌ అంటూ ప్రాధేయపడ్డాడు. మరి స్టేక్‌ ఇంజినీర్‌ ఉద్యోగానికి నీ అర్హత ఏమిటి అని ప్రశ్నిస్తే.. మీరు ఆఫర్‌ చేసిన జాబ్‌కు వంద శాతం న్యాయం చేస్తాను. వినూత్నంగా కొత్త అప్లికేషన్‌తో మీరు ఊహించినదాని మంచి రిజల్ట్‌ వచ్చేలా చేయగలను అని అన్నాడు.

నా కలను సాకారం చేయండి.. (Job Application)

ఒక వేళ ఉద్యోగం లభించకపోతే తన చిన్ననాటి ప్రేమను కోల్పోవాల్సి వస్తుందని దీనంగా మొహం పెట్టాడు. తన ప్రియురాలి తండ్రి తనతో పెళ్లి చేయడు. తనకు ఉద్యోగం ఇచ్చి తన కల సాకారం చేయండి అని ప్రాధేయపడ్డాడు. దీనికి సంబంధించి స్ర్కీన్‌ షాట్‌ తీసి మిసెస్‌ బజాజ్‌ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. దాని కింద క్యాప్షన్‌ కూడా రాశారు. ‘హైరింగ్‌ కెన్‌ బి ఫన్‌” అంటూ…ఈ నెల 13న ఈ పోస్ట్‌ షేర్‌ చేస్తే 22 లక్షల మంది చూడడమే కాకుండా నాలుగువేల మంది లైక్‌లు కూడా ఇచ్చారు.

అతనికి నిజాయితికి ఉద్యోగం ఇవ్వండి అని ఒక యూజర్‌ సిఫారసు చేశాడు. మరో యుజర్‌ కూడా ఉద్యోగం ఇవ్వండి ప్లీజ్‌ అంటూ పోస్ట్‌ పెట్టాడు. అతను నిజాయితీగా తన వెర్షన్‌ చెప్పాడు. మరి అసలు పరీక్ష హెచ్‌ఆర్‌ రౌండ్‌లో తేలుతుంది. అతను 10/10 నిజాయితీ పరుడు అని మరి కొందరు పోస్ట్‌ చేశాడు. మరి మిసెస్‌ బజాజ్‌ అతని నిజాయితీ ప్రేమను చూసి ఉద్యోగం ఇచ్చారో లేదో తెలియదు.

Exit mobile version