Site icon Prime9

Siraz Ahmad : ప్రపంచ నంబర్ వన్ బౌలర్ గా.. హైదరాబాదీ పేసర్ “సిరాజ్ అహ్మద్”

hyderabadi team india player siraz ahmad got 1st rank in bowlars list

hyderabadi team india player siraz ahmad got 1st rank in bowlars list

Siraz Ahmad : హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ గొప్ప ఘనతను అందుకున్నాడు. ప్రపంచ క్రికెట్లో అగ్రస్థానానికి దూసుకెళ్లాడు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిసారి నంబర్‌వన్‌ ర్యాంకును కైవసం చేసుకున్నాడు.

ఐసీసీ ప్రకటించిన జాబితాలో సిరాజ్‌ 729 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు ఈ టీం ఇండియా ప్లేయర్.

ఆస్ట్రేలియా పేసర్‌ హేజిల్‌వుడ్‌ (727), న్యూజిలాండ్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌ (708)లను వెనక్కినెట్టి అతడు ఈ ఘనత సాధించడం గమనార్హం.

ఏడాదిగా వన్డే క్రికెట్లో నిలకడగా రాణిస్తోన్న సిరాజ్‌.. సొంతగడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్‌లతో సిరీస్‌లలో అదరగొట్టాడు.

హైదరాబాద్ గల్లీ నుంచి వరల్డ్ నంబర్ వన్ గా..

తన క్రికెట్‌ ప్రస్థానాన్ని హైదరాబాద్‌ గల్లీల్లో ఆరంభించిన సిరాజ్‌.. ఇప్పుడు ప్రపంచ నంబర్‌వన్‌ పేసర్‌గా ఎదగడం ఎంతో గర్వకారణం.

2019లో వన్డే అరంగేట్రం చేశాక ఈ ఫార్మాట్లో రెండో మ్యాచ్‌ ఆడేందుకు మూడేళ్లు ఎదురు చూడాల్సి వచ్చింది.

తొలి మ్యాచ్‌లో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చి, ఒక్క వికెట్‌ కూడా తీయలేక జట్టులో స్థానం నిలబెట్టుకోలేకపోయాడు.

షమి, భువనేశ్వర్‌, బుమ్రా ప్రధాన పేసర్లుగా కొనసాగుతుండడం.. మధ్యలో కరోనా కారణంగా వన్డే జట్టుకు దూరమయ్యాడు.

పేదరికం నుంచి వచ్చి, తండ్రి (ఇప్పుడు లేరు) ప్రోత్సాహంతో ఎదిగిన అతను మరోసారి శ్రమనే నమ్ముకున్నాడు.

కచ్చితమైన లైన్‌తో బౌలింగ్‌ చేయడంపై పట్టు సాధించి.. ఇన్‌స్వింగ్‌, ఔట్‌స్వింగ్‌ రాబట్టడంలో రాటుదేలాడు.

గతేడాది ఫిబ్రవరిలో వన్డేల్లో పునరాగమనం చేశాడు. అప్పటి నుంచి ఆడిన 20 వన్డేల్లో 38 వికెట్లు పడగొట్టాడు.

ఇటీవల శ్రీలంక, న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతని బౌలింగ్‌ చూస్తేనే.. ఎంతగా పురోగతి సాధించాడో అర్థమవుతోంది.

ఇప్పుడు కపిల్‌దేవ్‌, బుమ్రా తర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న మూడో భారత పేసర్‌గా సిరాజ్‌ నిలిచాడు.

2022కి గాను ఐసీసీ పురుషుల వన్డే జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు.

ఇటీవల గాయాల కారణంగా బుమ్రా జట్టుకు దూరమవుతుంటే, షమికి నిలకడ లోపించింది.

ఈ ఏడాది వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో జట్టుకు ఇప్పుడు సిరాజ్‌ కీలకంగా మారాడు.

కాగా, 2022 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డులు..

మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్             –    సూర్యకుమార్ (భారత్)
విమెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్          –    తహ్లియా మెక్‌గ్రాత్ (ఆస్ట్రేలియా)
మెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్     –    మార్కో జాన్సెస్ (సౌతాఫ్రికా)
విమెన్స్ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్  –    రేణుకా సింగ్ (భారత్)
మెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్               –   బాబర్ అజామ్ (పాకిస్తాన్)
విమెన్స్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్           –   నటాలియా సీవర్ (ఇంగ్లాండ్)
మెన్స్ టెస్టు క్రికెటర్ ఆఫ్ ది ఇయర్            –   బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్)
అంపైర్ ఆఫ్ ది ఇయర్                                 –   రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లాండ్)

 

మరో బౌలర్‌ మహ్మద్‌ షమి 11 స్థానాలు మెరుగై 32వ ర్యాంకు సాధించాడు.

వన్డేల్లో వరుస సెంచరీలతో హోరెత్తిస్తున్న శుబ్‌మన్‌ గిల్‌ బ్యాటర్‌ ర్యాంకింగ్స్‌లో పురోగతి సాధించాడు.

20 స్థానాలు ఎగబాకి ఆరో ర్యాంకును సొంతం చేసుకున్నాడు. విరాట్‌ కోహ్లి ఏడో ర్యాంకు సాధించాడు.

టీమ్‌ఇండియా కెప్టెన్‌ రోహిత్‌శర్మ రెండు స్థానాలు మెరుగై స్టీవ్‌ స్మిత్‌ (ఆస్ట్రేలియా)తో కలిసి సంయుక్తంగా 8వ స్థానంలో నిలిచాడు.

ఐసీసీ మెన్స్ టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా సూర్యకుమార్, ఎమర్జింగ్ విమెన్స్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా రేణుకా సింగ్‌ పేర్లను ప్రకటించింది ఐసీసీ.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

Exit mobile version