Actor Pavithra Gowda:కన్నడ నటుడు దర్శన్ అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో జైలులో ఉన్న నటి పవిత్ర గౌడ పోలీసు కస్టడీలో ఉన్నప్పుడు మేకప్ ధరించి కనిపించడం సంచలనంగా మారింది. దీనిపై పోలీసులు బుధవారం మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసు జారీ చేశారు.
వాష్ రూమ్ కి వెళ్లినపుడు..( Actor Pavithra Gowda)
రేణుకాస్వామి హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న పవిత్రను బెంగళూరులోని ఆమె నివాసానికి తీసుకెళ్లి నేరం జరిగిన ఘటన వివరాలను నమోదు చేసుకున్నారు. ఆమె తన నివాసం నుండి బయటకువస్తున్నప్పుడు లిప్‌స్టిక్ మరియు మేకప్ వేసుకుని నవ్వుతూ కనిపించింది.దీనిపై బెంగళూరు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గిరీష్ మాట్లాడుతూ.. ‘పవిత్ర గౌడ మేకప్‌తో తన ఇంటి నుండి బయటకు వస్తున్న విజువల్స్ మా దృష్టిని వచ్చాయి. , మేము దీనిపై వివరణ ఇవ్వాలంటూ సబ్ ఇన్‌స్పెక్టర్‌కు నోటీసు జారీ చేసామని చెప్పారు. పవిత్ర గౌడను వాష్‌రూమ్‌కు అనుమతించినప్పుడు మేకప్ వేసుకుని ఉండవచ్చని పోలీసు అధికారులు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. పోలీసు కస్టడీ సమయంలో ఆమె తన మేకప్ కిట్‌ను కూడా తన వెంట తీసుకెళ్లిందని కూడా వారు పేర్కొన్నారు.
ఈ కేసులో ఏ1 నిందితురాలిగా ఉన్న రేణుకాస్వామిని దారుణంగా హత్య కేసులో పవిత్ర గౌడ ఏ1 గా ఉన్నారు. రేణుకా స్వామి మృతదేహం జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్ పక్కనే ఉన్న మురికినీటి కాలువ దగ్గర కనిపించింది. షాక్, రక్తస్రావం కారణంగా రేణుకస్వామి మృతి చెందినట్లు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ఇప్పటివరకు జరిగిన విచారణ ప్రకారం, రేణుకాస్వామి చిత్రహింసలలో భాగంగా విద్యుదాఘాతానికి గురయ్యాడు, అతని శరీరంపై 39 గాయాలున్నట్లు సమాచారం. ఈ కేసులో దర్శన్, పవిత్రతో పాటు మరో 15 మందిని అరెస్టు చేసి ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.నిందితుల్లో ఒకరైన చిత్రదుర్గలోని దర్శన్ ఫ్యాన్స్ క్లబ్‌లో భాగమైన రాఘవేంద్ర, దర్శన్ తనను కలవాలనుకుంటున్నాడనే సాకుతో రేణుకస్వామిని బెంగళూరులోని ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్డుకు తీసుకొచ్చాడని సమాచారం. ఈ షెడ్డులోనే అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేశారని ఆరోపించారు