Bruce Lee Death: అమెరికన్ మార్షల్ ఆర్ట్స్ లిజెండ్ సినీ నటుడు బ్రూస్లీ మృతి గురించిన వాస్తవాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఎక్కువ మోతాదులో ఆయన నీరు తాగడం వల్లే మృతి చెందినట్లు సైంటిస్టులు తాజా అధ్యయనంలో కనుగొన్నారు. ది ఎంటర్ ది డ్రాగన్ నటుడు బ్రూసీ లీ ప్రపంచానికి మార్షల్ ఆర్ట్స్ కల్చర్ పరిచయం చేశాడు. జులై 20, 1973లో ఆప్పుడు ఆయన వయసు కేవలం 32 ఏళ్లు మాత్రమే. ఆయన సెర్బియల్ ఒడెమియా అంటే మెదడు ఉబ్బడంతో మృతి చెందారు. అప్పుడు డాక్టర్లు బ్రూస్లీ పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్లే బ్రెయిన్ ఉబ్బి మృతి చెందాడని భావించారు.
తాజాగా ఒడెమియా గురించి పరిశోధకులు లోతుగా అధ్యయనం జరిపారు. వారి అధ్యయనంలో తేలిందేమిటంటే ఆయన కిడ్నీలోని నీరు బయటికి రాకపోవడం వల్లే మృతి చెందారని స్పష్టం చేశారు. అయితే ఇప్పటి వరకు బ్రూస్లీ మృతికి సంబంధించి వివిధ రకాల కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. ఉదాహరణకు ఆయనను గ్యాంగస్టర్‌లు కాల్చి చంపారని ఒకరంటే, కాదు కాదు ఆయన ప్రియురాలు అసూయతో విషం ఇచ్చి చప్పిందని ఒకరంటే, కాదు కాదు హార్ట్ ఎటాక్ అని మరి కొందరు ఇష్టం వచ్చినట్లు కథనాలు అల్లారు. తాజాగా సైంటిస్టులు వెల్లడించిన వాస్తవాలతో ఇవన్నీ ఒట్టి పుకార్లే అని తేలిపోయింది. సైంటిస్టులు మాత్రం బ్రూస్లీ హైపోనట్రేమియాతో మృతి చెందారని చెబుతున్నారు. దీనికి కారణం ఎక్కువ మొత్తంలో నీరు తాగడం వల్ల శరీరంలో సోడియం లెవెల్ పెరిగిపోతుందని, దీని వల్ల ముఖ్యంగా మెదుడు ఉబ్బిపోయి, బ్యాలెన్స్ తప్పుతుందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇక బ్రూస్లీ విషయానికి వస్తే ఆయన ఎక్కువ మొత్తంలో ద్రవ పదార్దాలు తీసుకోవడం వల్లే దాహం ఎక్కువ వేస్తుందని, ఉదాహరణకు మాదకద్రవ్యాలు గంజాయి లాంటివి తాగితే విపరీతమైన దాహం వేస్తుంది. మోతాదుకు మించి నీరు తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిన్నాయని వారు పేర్కొన్నారు.
ఇక బ్రూస్ లీ మృతి విషయానికి వస్తే, ఆయన కిడ్నీ పనిచేయకపోవడం వల్లే మృతి చెందారని స్పష్టం చేస్తున్నారు. కిడ్నీలు పనిచేయకపోవడం వల్ల హైపోనట్రేమియా, సెర్బియల్ ఒడేమియా అంటే మెదడు వాపు వల్ల ఆయన మృతి చెందారని శాస్ర్తవేత్తలు పేర్కొన్నారు. తాగిన నీరు మూత్రవిసర్జన ద్వారా బయటికి వెళ్లిపోవాలి. ఇది మిస్‌మ్యాచ్ కావడం వల్లే బ్రూస్ లీ మృతి చెందారని శాస్ర్తవేత్తలు స్పష్టం చేశారు. బ్రూస్ లీ భార్య లిండా లీ ఒక సందర్భంలో బ్రూస్ లీ క్యారెట్, ఆపిల్ జూస్ తాగేవారని, కేవలం ద్రవపదర్థాలే ఆయన ఆహారం అని పేర్కొన్నారు. బ్రూస్ లీ రోజు ఎంత నీరు తాగే వారో మాథ్యూ పోల్లీ తన పుస్తకం ” బ్రూస్ లీ ఏ లైఫ్’ అనే పుస్తకంలో ప్రస్తావించారు. 2018లో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆయన ఎలా అనారోగ్యానికి గురైందనే విషయాన్ని కూడా ఈ పుస్తకంలో పొందుపర్చారని న్యూయార్కు పోస్టు వెల్లడించింది.