Hair inside Throat: ఒక ఆస్ట్రేలియన్ వ్యక్తి 30 సంవత్సరాలకు పైగా ఎక్కువగా ధూమపానం చేయడంతో అతని శరీరంలో అసాధారణ పరిస్దితి తలెత్తింది. అతని గొంతు లోపల వెంట్రుకలు పెరిగాయి. 2007లో అతను దీర్ఘకాలిక దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, బొంగురుస్వరం వంటి ఫిర్యాదులతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. అతను 1990లో తనకు 20 సంవత్సరాల వయస్సులో ధూమపానం చేయడం ప్రారంభించానని వైద్యులకు తెలియజేశాడు. రోగిని పరీక్షించిన వైద్యులు అతనికి గతంలో ఆపరేషన్ జరిగిన గొంతులో వెంట్రుకలు పెరుగుతున్నట్లు గమనించారు.
పొగతాగడం మానేసిన తరువాతే..(Hair inside Throat)
వైద్య సిబ్బంది వెంట్రుకలను తొలగించినప్పటికీ, అవి తిరిగి పెరుగుతూనే ఉన్నాయి. తరువాత 14 సంవత్సరాలు, రోగి అదే లక్షణాలతో ఏటా ఆసుపత్రిని సందర్శించాడు.అతను ధూమపానం మానేసిన తర్వాత 52 ఏళ్ల వయసులో ఈ సమస్య చివరకు పరిష్కారమయింది. వైద్య నిపుణులు 2022లో అతని గొంతులోని జుట్టు కణాలను మళ్లీ పెరగకుండా నిరోధించారు.అమెరికన్ జర్నల్ ఆఫ్ కేస్ రిపోర్ట్స్‌లో ఈ కేసును వెల్లడిస్తూ, వైద్యులు రోగి సిగరెట్ తాగడం వల్ల వెంట్రుకలు పెరగడం ప్రారంభమయిందని భావిస్తున్నామని చెప్పారు. మొత్తంమీద ధూమపానం వల్ల వచ్చే సమస్యలు ఏమిటన్నది మనకు అవగాహన ఉంది. కాని ఇంతవరకూ మనం ఎవరూ చూడని కొత్త సమస్య ఒకటి ఇపుడు వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియన్ మనిషి కథ విపరీతమైన ధూమపానం చేసేవారికి ఒక హెచ్చరిక అని చెప్పవచ్చు.