Site icon Prime9

Age Reverse Treatment: వయసును తగ్గించుకోవచ్చా? ఏడాదికి రూ.16 కోట్లు ఖర్చుపెడితే ఏజ్ రివర్స్ అవుతుందా?

age reverse treatment story of california businessman brian johnson

age reverse treatment story of california businessman brian johnson

Age Reverse Treatment : గడిచిపోయిన కాలాన్ని, పోయిన యవ్వనాన్ని తిరిగి తీసుకురాలేం.

ఇప్పటిదాకా మనమంతా ఇలాగే అనుకున్నాం. ఇదే నిజమని నమ్ముతున్నాం.

కాలం సంగతేమో కానీ.. యవ్వనాన్ని మాత్రం తిరిగి తెచ్చుకోవాలని ఒకాయన ప్రయత్నిస్తున్నారు.

ప్రయత్నించడం కాదు.. ఫలితాలు కూడా సాధిస్తున్నాను అంటున్నాడు.

వయసు పెరగడాన్ని మాత్రమే మనం ఇంతవరకూ చూశాం. ఈయన మాత్రం వయసు పెరగడాన్ని ఆపడం మాత్రమే కాదు.. వయసును తగ్గించుకుంటూ, యవ్వనంలోకి వెళ్తున్నాడు.

ఇందుకోసం అతను ఎంత ఖర్చుపెడుతున్నాడో తెలుసా.. ఏడాదికి అక్షరాలా 16 కోట్ల రూపాయలకు పైనే. ఇంతకీ ఎవరా వ్యక్తి .. ఏంటా కథ

ఏడాదికి రూ.16.5 కోట్లు ఖర్చు..

కాలిఫోర్నియాకు చెందిన బ్రియాన్ జాన్సన్ ఒక బిజినెస్ మ్యాన్.

ఏజ్ పెరగకుండా కనిపించేందుకు కొన్ని ట్రీట్ మెంట్స్ తీసుకుంటే యంగ్ గా కనిపించడంతో పాటు ఎక్కువకాలం బతకొచ్చని బ్రియాన్ ఎక్కడో చదివారు.

ఇంకేముంది.. వెంటనే వైద్యులను సంప్రదించారు. 18 ఏళ్ల వయసులో తాను ఎలా కనిపించేవాడో, తిరిగి అదే రూపం పొందడం సాధ్యమేనా? అని అడిగారు.

దానికి వారు అది సాధ్యమేనని, కాకపోతే ఒక స్పెషల్ ట్రీట్మెంట్‌తో ప్రయత్నించొచ్చు అని చెప్పారు.

అయితే, ఈ ట్రీట్‌మెంట్‌కు ఏడాదికి సుమారు పదహారున్నర కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు.

ముసలితనం రాకుండా నిత్యం యువకుడిలా కనిపించేలా చికిత్స చేస్తామని ఆ డాక్టర్స్ హామీ ఇచ్చారు.

తన వద్ద చాలా డబ్బులు ఉండటంతో.. బ్రియాన్ ఆ చికిత్సకు ఓకే చెప్పేశారు.

ఇక అప్పటి నుంచి వైద్యులు అతనికి చికిత్స అందించడం ప్రారంభించారు.

ప్రస్తుతం ఆలివర్‌ జోల్మాన్‌ నేతృత్వంలోని వైద్యుల బృందం బ్రియాన్ జాన్సన్‌కు చికిత్స అందిస్తోంది.

ఏజ్ రివర్స్ ట్రీట్‌మెంట్‌లో ఏం చేస్తారు?

ఈ ట్రీట్మెంట్ తర్వాత తన బాడీ షేప్, ఊపిరితిత్తుల సామర్థ్యం 18 ఏళ్ల యువకుడిలా కనిపిస్తున్నాయని..

గుండె పని తీరు 37 ఏళ్ల వ్యక్తిలా, చర్మం నిగారింపు 28 ఏళ్ల వ్యక్తిలా మారిందని బ్రియాన్ చెబుతున్నారు.

ఈ ఏడాది కూడా మరో పదహారున్నర కోట్లు వెచ్చించి.. తన మెదడు, గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, దంతాలు, మొదలైన అవయవాలు 18 ఏళ్ల యువకుడిలా మారేంత వరకు చికిత్స తీసుకోవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జాన్సన్‌ శరీరభాగాల పనితీరును తెలుసుకునేందుకు నిత్యం 30 మంది వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది.

ఇందులో మరో ట్విట్స్ ఏంటంటే ఈ చికిత్స కోసం జాన్సన్ తన ఇంటినే ల్యాబ్‌గా మార్చేశారు.

ఇలా యవ్వనం కోసం భారీగా డబ్బు వెచ్చించడాన్ని చూసి పలవురు ఆశ్చర్యపోతూ నోరెళ్లబెడుతున్నారు.

సాధారణంగా వయసు పెరిగేకొద్దీ శరీరంలో చాలా మార్పులు జరుగుతుంటాయి.

అవయవాల పనితీరులో కూడా మార్పు కనిపిస్తుంది. ముసలితనం తాలూకా ఛాయలు వచ్చేస్తాయి.
ఇది సర్వసాధారణం.

వయస్సు కనిపించకుండా ఉండేందుకు ఎంతో మంది అనేక ప్రయత్నాలు చేస్తుంటారు.

కొంత మంది యోగా మరికొంత మంది బ్యూటీ టిప్స్.. ఇంకొంత మంది డైట్ ఫాలో అవుతూ యంగ్ లుక్ ను మెయిన్ టైన్ చేస్తారు.

ఇప్పుడు డబ్బులు ఉన్నవాళ్లు ఇలాంటి ట్రీట్‌మెంట్స్‌ చేయించుకోవడం సాధారణం అయిపోతుందేమో చూడాలి.

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version