Travel Tips: చాలామంది ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బాగా ఒత్తిడికి గురి అవుతారు. ఏం తీసుకెళ్లాలి? ఏవి సర్దుకోవాలి? ఇలా ప్రతి దానికి హైరానా పడిపోతారు. ఒక్కోసారి బ్యాకులు ఎక్కువ అవుతాయని.. అవసరం అయిన వాటిని కూడా తీసుకుని వెళ్లరు. దీంతో బయట ప్రదేశాలకు వెళ్లినపుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ప్రయాణాలు చేయాలనుకున్నపుడు బ్యాగులు ఎలా సర్దుకోవాలి. ఏఏ వస్తువులు వెంట తీసుకెళ్లాలనే దానిపై స్పష్టత ఉండాలి. అలాంటపుడే ప్రయాణాలు ఈజీగా సాగుతాయి. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే ప్రయాణం హ్యాపీగా జరుగుతుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు(Travel Tips)
ముందు ఎన్ని రోజులు వెళ్లాలనుకుంటున్నారో, ఏలాంటి వస్తువులు అవసరమవుతాయో లిస్టు రాసుకోవాలి. చాలామంది బట్టలను మడతపెట్టి బ్యాగ్‌లో పెట్టుకుంటారు. ఇలా చేస్తే బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పెట్టేందుకు కుదరతు. కాబట్టి బ్యాగ్‌లో ఎక్కువ బట్టలు పట్టాలంటే డ్రెస్సులను రోల్ చేసి పెట్టాలి.
మార్కెట్ లో ప్రస్తుతం జిప్ కవర్లు దొరుకుతున్నాయి. బట్టలను అందులో పెట్టి బెలూన్స్ కు గాలికొట్టే పరికరాలతో ఈ కవర్లలో ఉన్న గాలిని తీసే వీలు ఉంటుంది. దీంతో ఎక్కువ వస్తువులు బ్యాగ్‌లో పెట్టుకోవచ్చు.
జర్నీ చేసేటపుడు కొన్ని వస్తువులు అవసరమవుతాయి. వాటర్ బాటిళ్లు, ఛార్జర్స్, స్నాక్స్ లాంటివి ప్రత్యేకంగా ఒక బ్యాగ్‌లో పెట్టుకోవాలి. అవసరమైనప్పుడు ఉపయోగించుకునేందుకు వీలుగా ఉంటుంది.
ప్రయాణాలు చేసేటప్పుడు తప్పనిసరిగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్ వెంట తీసుకెళ్లాలి. రోజూ ఉపయోగించే వాటిని తప్పకుండా తీసుకెళ్లండి. దువ్వెన, షాంపూ, టవల్ లాంటి వస్తువులు తప్పకుండా తీసుకెళ్లాలి. దీని వల్ల వెళ్లిన చోట ఇబ్బంది పడకుండా ఉంటారు.
కొంతమంది ప్రయాణాలు అనగానే ఎక్కువ వస్తువులు సర్దేస్తుంటారు. ఈ పద్ధతి సరైంది కాదని గుర్తుంచుకోవాలి. అనవసరమైన వస్తువులు తీసుకెళ్లకుండా ఉపయోగపడేవి తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఎలాంటి ప్రాంతానికి వెళ్తున్నారో, అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలి. ఒకవేళ చలి ప్రాంతమైతే స్వెటర్లు, దుప్పట్లు వెంట తీసుకెళ్లాలి.
ప్రయాణాలు అనగానే కొంతమంది షాపింగ్ చేసి అన్ని చాలా వస్తువులను కొనేస్తుంటారు. కొనేముందు ఆ వస్తువు అవసరం నిజంగా ఉందా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఆ ప్రయాణానికి మాత్రమే అవసరం ఉండి.. తర్వాత అక్కరలేని వస్తువులను కొనక పోవడమే మంచిది. ఆ ప్రయాణం వరకు స్నేహితులు, బంధువుల దగ్గర నుంచి తీసుకుని అవసరం తీరిపోయిన తర్వాత తిరిగి ఇచ్చేస్తే సరి. దీనివల్ల అనవసరపు ఖర్చు తగ్గుతుంది. కొత్త ప్రదేశాలు వెళ్లినప్పుడు కాస్త ఉత్సాహం ఉంటుంది. కానీ మీతో పిల్లల్ని కూడా తీసుకెళ్తే వారిని గమనిస్తూ ఉండాలి. మీ పర్యవేక్షణలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు.