Site icon Prime9

Rainbow River: విశ్వసుందరి కిరీటం ఆ నది సొంతం.. ఎందుకో తెలుసా..!

Rainbow River prime9 news

Rainbow River prime9 news

Rainbow River: సాధారణంగా ఇంద్రధనుస్సు ఎక్కడుంటుంది అంటే మీరేం చెప్తారు ఆకాశంలో వస్తుంది అంటారు. కాదు నేను భూమి మీద ఉంటుంది అని చెప్తాను ఎందుకో తెలుసా… కొలంబియాలో ఓ రెయిన్ బో ఉంది. అది వర్షం వచ్చినప్పుడే కాదు ఎల్లవేళలా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా అది ఓ నది అండి దానిని చూడడానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి.

దక్షిణ అమెరికాలోని కొలంబియాలో ఉన్న ఓ నది పేరు రెయిన్‌బో. ప్రపంచంలోనే అంత అందమైన నది మరోటి ఉండదంటే మీరు నమ్ముతారా… నిజంగా విశ్వంలో ఉన్న నదులన్నింటికీ పోటీ నిర్వహిస్తే విశ్వసుందరి కిరీటం ఈ నదికే వస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ నది అందాలను చూడడానికి రెండు కళ్లు చాలవు అంత అందంగా ఉంటుంది. ఎందుకో తెలుసా ఇంద్రధనుస్సులోని రంగులన్నీ ఈ నది సొంతం. ఈ ప్రాంతంలో మకరేనియా క్లేవిగెరా అనే నీటి మొక్కలు ఎక్కువగా పెరుగుతాయట దానివల్లే ఈ నది రంగురంగులుగా ఉంటుందని స్థానిక గైడ్లు తెలిపారు. కాగా ఈ నది రంగు గురించి అనేక వాదనలున్నాయి రాళ్లల్లో ఖనిజాలు ఉండడం వల్లే ఈ నది మల్టీకలర్స్ లో కనిపిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వివిధ రంగుల్లో కనువిందు చేస్తున్న ఈ నదిని చూడడానికి పర్యాటకులు పెద్దఎత్తున వస్తారు. ఈ రివర్ ను కనో క్రిస్టాలీస్, రెయిన్ బో రివర్ అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతాన్ని షీల్ ఆఫ్ గయానాగా అని అభివర్ణిస్తారు. దీనికి లక్షల ఏళ్ల చరిత్ర ఉందని అంటారు.

ఈ నదిలో మొక్కలు ఏడాదికి ఒక సెంటీమీటర్ మాత్రమే పెరుగుతాయని.. నదిలోని ఖనిజాలకు అనుగుణంగానే ఇక్కడి పూల రంగు ఉంటాయిని పరిశోధకులు తెలిపారు. అమెజాన్ అడవి, ఆండియన్ పర్వత శ్రేణులు, ఒరినోకియా మైదాన ప్రాంతం ఇక్కడ కలిసి ఉంటాయి అది కూడా ఇక్కడి ప్రత్యేకతే. ఏదిఏమైనా ఈ ప్రకృతి అందాలను చూసి పర్యాటకులు మంత్రముగ్దులవుతున్నారు.

ఇదీ చదవండి: Andhra Ooty Araku Valley: ఆంధ్రా ఊటీ అరకులో చూడవలసిన ప్రదేశాలు ఇవే

Exit mobile version