Today Gold And Silver Price : బులియన్ మార్కెట్ లో గడిచిన రెండు రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా అయితే ఈరోజు మాత్రం పసిడి ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పసిడి ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. 22 క్యారెట్ల బంగారంపై, 24 క్యారెట్ల బంగారంపై రూ. 50 మేర తగ్గింది. దీంతో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 గా ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది. కానీ బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపిస్తే.. వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది.
ఇక బంగారం ధరలను ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్‌లోనే తెలుసుకునే విధంగా ఇండియన్ బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెసులుబాటు కల్పించింది. ఇందుకోసం మీరు 8955664433 నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే.. వెంటనే మీ మొబైల్ నెంబర్‌కు ఎస్‌ఎమ్‌ఎస్ రూపంలో బంగారం ధరలు వస్తాయని వెల్లడించారు. అదే విధంగా గోల్డ్ రేట్లను తెలుసుకునేందుకు www.ibja.co లేదా ibjarates.comలో సమాచారం పొందవచ్చు. ఇక దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
దేశ రాజధాని న్యూ ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,790 వద్ద కొనసాగుతోంది.
ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.
అదే విధంగా చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 57,050 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 62,230 వద్ద కొనసాగుతోంది.
ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 గా ఉంది.
తెలుగు రాష్ట్రాల లోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (Today Gold And Silver Price)..
హైదరాబాద్‌లో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 61,640గా ఉంది.
ఇక నిజామాబాద్‌లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 56,500కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
అదే విధంగా విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ. 56,500 కాగా, 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ. 61,640 వద్ద కొనసాగుతోంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా లాంటి నగరాల్లో కిలో వెండి ధర రూ. 76,000గా ఉంది.
అయితే చెన్నైలో మాత్రం అత్యధికంగా రూ. 79,000గా ఉంది.
ఇక బెంగళూరులో కిలో వెండి ధర రూ. 75,000 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Today Gold And Silver Price)..
ఇదిలా ఉంటే హైదరాబాద్‌తో పాటు విజయవాడ, విశాఖపట్నంలోనూ కిలో వెండి ధర రూ. 79,000 వద్ద కొనసాగుతోంది.
గమనిక.. ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ఒకసారి ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.