Site icon Prime9

Gold And Silver Price: బంగారం కొనే వారికి గుడ్ న్యూస్.. ఈ రోజు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే

Today Gold And Silver Price in india on november 11 2023

Today Gold And Silver Price in india on november 11 2023

Gold And Silver Price: గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొన్నటికి మొన్న జూన్ 3న బంగారం ధరలు భారీగా తగ్గి ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. అసలే భారతీయలకు బంగారం అంటే అమితమైన ఇష్టం ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. తమకంటూ ఎంతో కొంత బంగారం ఉండాలని ఆశిస్తుంటారు. అందుకే పెళ్లిళ్లలోనే కాకుండా ఇతర ఏ ఏ శుభకార్యాలైనా, సందర్భాల్లోనూ బంగారం కొంటుంటారు. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలైన ఢిల్లీ, హైదరాబాద్ మహా నగరాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,450 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,480 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ. 60,870గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,300 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,330 గా ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,300 , 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330గా కొనసాగుతోంది.

వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.73,000లుగా ట్రెండ్‌ అవుతోంది. ఇక హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా కొనసాగుతోంది.

Exit mobile version