Gold And Silver Price: బంగారం ధరలు రోజురోజుకు విపరీతంగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్నాయి. మధ్యతరగతి ప్రజలు పసిడిని కొనే ఆలోచన చెయ్యాలంటేనే అమ్మో అంటూ బెంబేలెత్తిపోతున్నారు. మరి తాజాగా దేశీయంగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 250 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం మీద రూ. 280 ధర పెరిగింది. అయినప్పటికీ ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ కావడం వల్ల బంగారం కొనుగోళ్లు భారీగానే సాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లోని మార్కెట్లలో ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ప్రధాన నగరాల్లోని ధరలు ఇలా(Gold And Silver Price)
బంగారం ధర:
చెన్నైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.57,370 కాగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.62,590గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల తులం ధర రూ.62,130 వద్ద ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ.57,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.62,280 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 వద్ద కొనసాగుతోంది.
విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.56,950 కాగా, 24 క్యారెట్ల ధర రూ.62,130గా ఉంది.
విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి ధర రూ.56,950 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.62,130 ఉంది.
వెండి ధర:
చెన్నైలో కిలో వెండి ధర రూ.82,700
ముంబైలో రూ.78,000
ఢిల్లీలో రూ.78,000
హైదరాబాద్‌లో రూ.82,700
విజయవాడలో రూ.82,700 ఉండగా విశాఖలో కూడా ఇదే ధర కొనసాగుతోంది.