Gold And Silver Price: గత కొన్ని రోజులుగా బంగారం ధరలు కాస్త హెచ్చుతగ్గులుగా కనిపిస్తున్నాయి. సోమవారం నుంచి బంగారం ధర భారీగా తగ్గకపోయినా స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం పెళ్లిళ్ల సీజన్ నడుస్తున్న తరుణంలో గోల్డ్, సిల్వర్ విక్రయాలు అధికంగా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 55,450 ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 60,480 గా ఉంది.
ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,330గా ఉంది
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 55,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 60,330 గా ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,300, 24 క్యారెట్ల తులం పసిడి ధర రూ.60,330 లుగా పలుకుతోంది
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.73,000 లుగా ఉంది. ముంబై, బెంగళూరు, కోల్‌కతా నగరాల్లో రూ.73,000లుగా కొనసాగుతుంది. ఇక హైదరాబాద్, విశాఖ నగరాల్లో రూ.77,800 లుగా కొనసాగుతోంది.