Prime9

Heavy Rains to Telangana: రానున్న మూడురోజుల్లో తెలంగాణలో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరియక

Heavy Rains expected to Telangana for Coming 3 Days: దక్షిణ ఒడిశా ప్రాంతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాలో అక్కడకక్కడ ఉరుములు, మెరుపులతో గంటకు 40 నుంచి 50 కిలోమిటర్ల వేగంతో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉండనుంది. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.

 

 

 

Exit mobile version
Skip to toolbar