Prime9

Accident: కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు.. ఇద్దరు మృతి

Car Hits Electric pole: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదులాబాద్ లో అర్ధరాత్రి కరెంట్ స్తంభాన్ని కారు ఢీకొంది. ప్రమాద సమయంలో కారులో నలుగురు యువకులు ఉన్నారు. వీరిలో భార్గవ్ యాదవ్, వర్షిత్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు. ఇక దినేష్ అనే మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

 

కాగా యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఎదులాబాద్ నుంచి కుంట్లూరు వైపు వెళ్తుండగా ఘటన జరిగింది. అయితే యువకులంతా పార్టీకి వెళ్లి వస్తున్నారా.. లేక ఏదైనా రిసార్ట్ కి వెళ్లారా అనేది తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Exit mobile version
Skip to toolbar