Prime9

Anganwadi Teachers : అంగన్‌వాడీ టీచర్లకు గుడ్ న్యూస్.. జీతాలు పెంచిన ప్రభుత్వం

Good News for Anganwadi Teachers : తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతుంది. సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం హామీలను అమలు చేస్తున్నారు. ఎన్నికల్లో అంగన్‌వాడీ టీచర్లకు ఇచ్చిన హామీని అమలు చేసి రేవంత్ సర్కార్ మాటను నిలబెట్టుకుంది. ఈ సందర్భంగా మినీ అంగన్‌వాడీ టీచర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 3,989 మంది మినీ అంగన్‌వాడీ టీచర్లను మెయిన్ టీచర్లుగా ప్రమోట్ చేసింది. మంగళవారం ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది.

 

తెలంగాణలో ఇక నుంచి అంగన్‌వాడీ టీచర్ల మాదిరిగానే మినీ అంగన్‌వాడీ టీచర్లు వేతనాలు తీసుకోనున్నారు. మినీ, మెయిన్ తేడా లేకుండా అందరూ అంగన్‌వాడీ టీచర్లేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నెల నుంచి అమల్లోకి ఉత్తర్వులు రానున్నాయి. ఏప్రిల్ నుంచి మినీ అంగన్‌వాడీలకు నెలకు రూ.13,650 వేతనం ఇవ్వనున్నట్లు చెప్పింది. గతంలో మినీ అంగన్‌వాడీలకు రూ. 7,800 జీతం ఇచ్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా మంత్రి సీతక్కకు మినీ అంగన్‌వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version
Skip to toolbar