Prime9

Bakrid: నేడే బక్రీద్ పండుగ.. గవర్నర్, సీఎం శుభాకాంక్షలు

Governor, CM Says Wishes: ముస్లీం సోదరలు నేడు బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు చెప్పారు. ఈద్ ఉల్ అజ్ పండుగ స్ఫూర్తిని, అత్యున్నత భక్తిని సూచిస్తుందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భాగస్వామ్యం, దానధర్మం, గౌరవం, అవసరమైన వారికి సాయం చేయడం ఈ పండుగ ఉద్దేశాలని పేర్కొన్నారు. శాంతి, ఐక్యతకు బక్రీద్ ప్రతీక అన్నారు.

 

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు. త్యాగానికి బక్రీద్ ప్రతీక అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని సందేశాన్ని ఇస్తుందని చెప్పారు. ఇక పలువురు మంత్రులు కూడా ముస్లీం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు చెప్పారు.

 

Exit mobile version
Skip to toolbar