Prime9

Minister Uttam: హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. మంత్రి ఉత్తమ్ కు తప్పిన ప్రమాదం

Telangana: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రమాదం తప్పింది. అధికారిక పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి హుజూర్ నగర్ వెళ్తుండగా.. మార్గమధ్యలోనే హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయని, గాలివానతోపాటు నల్లని మేఘాలతో విజిబులిటీ తగ్గిపోయింది. దీంతో పైలెట్ హెలికాప్టర్ ను కోదాడలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. విషయం తెలుసుకున్న కాంగర్ెస్ నేతలు, అధికారులు కోదాడకు చేరుకున్నారు.

 

హెలికాప్టర్ సేఫ్ గా ల్యాండ్ అవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రోడ్డు మార్గంలో కోదాడ నుంచి హుజూర్ నగర్ కు బయల్దేరి వెళ్లారు. అయితే ప్రతికూల వాతావరణం వలనే హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండ్ చేశామని.. హెలికాప్టర్ లో ఎలాంటి సమస్యలు లేవని అధికారులు వెల్లడించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేళ్లచెరువులో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. అనంతరం అధికారులతో పలు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు.

Exit mobile version
Skip to toolbar